హీరోయిన్స్ అంటే కేవలం హీరోయిన్ లుగా మాత్రమే నటించేందుకు మన తెలుగు వారు ఆసక్తి చూపిస్తారు.కాని కొందరు మాత్రం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా నటించేందుకు సిద్దం అవుతారు.
విలన్ గా నటించేందుకు ఆసక్తిగా ఉండే హీరోయిన్స్ లో సౌత్ ముద్దుగుమ్మలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.వారిలో వరలక్ష్మి ఒకరు.
ఆమె తమిళంలో వరుసగా సినిమా ల్లో నటించి మెప్పించింది.ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు విలన్ గా కూడా ఈ అమ్మడు నటిస్తూ ఉంది.
తెలుగు లో ఈమె విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. క్రాక్ సినిమా లో ఈమె పోషించిన పాత్ర సినిమా లో చాలా కీలకంగా మారింది.
ఆ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.అల్లరి నరేష్ నాంది సినిమా లో కూడా వరలక్ష్మి కీలక పాత్రలో నటించి మెప్పించింది.
ఈ రెండు సినిమా లు ఆమె ను టాలీవుడ్ లో బిజీ అయ్యేలా చేసింది.

తెలుగు లో ప్రస్తుతం వరలక్ష్మి మూడు నాలుగు సినిమా లు చేస్తున్నారు.బాలకృష్ణ తో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా లో ఈమె పాత్ర ఏంటీ అనేది క్లారిటీ లేదు.కాని ఈమె ఖచ్చితంగా నటించబోతుంది అనేది మాత్రం కన్ఫర్మ్.
ఇక మరో స్టార్ హీరో సినిమాలో కూడా ఈమె నటించబోతుంది.మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈమె వరుసగా సినిమా లు చేస్తుంది.రెండు సినిమా లు చేసి గోల్డెన్ లెగ్ గా మారిన ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని తెలుగు సినిమా లు చేయడం ఖాయం గా కనిపిస్తుంది.
స్టార్ హీరోల సినిమా లో కీలక పాత్రలతో పాటు సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్ గా కూడా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయి.నటిగా మంచి పేరు తెచ్చకోవడంతో పాటు అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కు తగ్గని ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్ లో ఎలాంటి పాత్రల్లో నటిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.