కరోనా కారణంగా వెంకటేష్ సినిమాలు మూడు ఆలస్యం అవుతున్నాయి.ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ కారణంగా నారప్ప మరియు దృశ్యం 2 చిత్రాలు విడుదల వాయిదా పడుతున్నాయి.
ఈ రెండు సినిమా లు కూడా ఇతర భాషల్లో సక్సెస్ అయ్యాయి.ఇవి రెండు రీమేక్ లు కనుక ఖచ్చితంగా సక్సెస్ ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లను వచ్చే నెల విడుదల చేయబోతున్నాం అనుకుంటూ ఉండగా కరోనా ఆ సినిమా లను ఆపేసింది.మళ్లీ షూటింగ్ పూర్తి చేసినా కూడా విడుదల ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు.
ఈ రెండు రీమేక్ లతో పాటు ఎఫ్ 2 కు సీక్వెల్ గా రూపొందుతున్న ఎఫ్ 3 సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతుంది.చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను వచ్చే నెలలో పట్టాలెక్కించి రెండు నెలల్లోనే పూర్తి చేస్తారని సమాచారం అందుతోంది.
వెంకటేష్ దృశ్యం 2 సినిమా ను అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్ చివర్లో లేదా జులై లో విడుదల చేయాలనుకున్నారు.కాని పరిస్థితి అందుకు సహకరించలేదు.ఇక నారప్ప సినిమా గురించి గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ మేకర్స్ ఊరిస్తూనే ఉన్నారు.ఎఫ్ 3 సినిమా ఇటీవలే పట్టాలెక్కినా కూడా మేకర్స్ ఆగస్టులోనే సినిమాను విడుదల చేయాలని భావించారు.
కాని కరోనా సెకండ్ వేవ్ ఆ సినిమా ప్లాన్ ను కూడా కిందా మీద చేసినట్లుగానే అనిపిస్తుంది.మరో సారి కూడా వెంకటేష్ అభిమానులకు ఎదురు చూపులు తప్పేలా లేవు.
మూడు సినిమా లు కూడా వెంకటేష్ అభిమానులను ఊరించేలా చేస్తున్నాయి.

ఈ మూడు సినిమా లు కూడా చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు.ఎందుకంటే దృశ్యం ఇప్పటికే సక్సెస్ అయ్యింది కనుక దృశ్యం 2 ఖచ్చితంగా సూపర్ హిట్.ఇక నారప్ప సినిమా కూడా రీమేక్.
కనుక నారప్ప సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుండే సినిమా పై అంచనాలు పెరిగి పోయాయి.ఇక ఎఫ్ 2 సక్సెస్ కనుక ఎఫ్ 3 మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.