ఈటెల రాజకీయ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ రకరకాల మలుపులు తిరుగుతూ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.ఇప్పటివరకు ఈటెల కాంగ్రెస్ లో చేరతాడనుకున్న కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా బీజేపీలో చేరనున్నాడనే ఊహగానాల నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు నిరాశ చెందినట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్ ను తిరిగి గాడిలో పడేయడానికి ఈటెల ను ఒక అస్త్రంలా వాడుకుందామనుకున్న కాంగ్రెస్ నేతలకు ఈటెల ఝలక్ ఇచ్చాడని చెప్పవచ్చు.
మరి కాంగ్రెస్ లో చేరిక పట్ల ఈటెల ఎందుకు నిరాశ చెందాడో ప్రస్తుతానికి ఈటెల స్పందించకపోయినా బీజేపీలో ఈటెల చేరిక దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తోంది.
ఈటెలకు కేంద్రమంత్రి పదవితో పాటు, తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇక ఈటెల చకచకా తీసుకున్న ఈ నిర్ణయాలతో కాంగ్రెస్ నేతలు నిరాశ చెందినట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగంగా స్పందించకున్నా అంతర్గతంగా నిరాశ చెందినది వాస్తవమేనన్నట్టు తెలుస్తోంది.మరి కాంగ్రెస్ నేతలు మరి కాంగ్రెస్ పటిష్టతకు ఎటువంటి వ్యూహాన్ని అమలుపరుస్తారనేది చూడాల్సి ఉంది.
అంతేకాక ఈటెల బీజేపీలో చేరితే జరిగే పరిణామాలపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.ఏది ఏమైనా ఈటెల వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నదని చెప్పవచ్చు.