ప్రముఖ డ్యాన్స్ షో అయిన “ఢీ” లో పాల్గొని మంచి కొరియోగ్రాఫర్లు అయిన డాన్సర్లు ఎందరో ఉన్నారు.ఈ ప్లాట్ ఫామ్ పై తమ నాట్య ప్రతిభను చాటి చిన్నపాటి సెలబ్రిటీ హోదా దక్కించుకున్న డాన్సర్లు కూడా ఎందరో ఉన్నారు.
వారిలో అక్సా ఖాన్ కూడా ఒకరు.ఈమె జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి “స్వింగ్ జర స్వింగ్ జర” పాట కి డాన్స్ స్టెప్పులు వేసి బాగా పాపులర్ అయ్యారు.
ఢీ 10 సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె తన ప్రత్యేకమైన డాన్స్ తో శేఖర్ మాస్టర్ తో సహా అందరిని మంత్రముగ్ధుల్ని చేశారు.
అయితే ఈ టాలెంటెడ్ డాన్సర్ చివరి వరకు పోటీ ఇచ్చారు కానీ ఫైనల్ కి చేరుకోలేక ముందుగానే ఎలిమినేట్ అయ్యారు.
కానీ ఆ సీజన్ ఫైనల్స్ లో స్పెషల్ పర్ఫామెన్స్ కింద ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేసే అవకాశాన్ని శేఖర్ మాస్టర్ కల్పించారు.దీంతో ఆమె ఫైనల్లో కూడా తనదైన శైలిలో డాన్స్ వేసి అందరి మనసులలో విజేతగా నిలిచారు.
ఐతే ఢీ లో తన ప్రతిభ చాటి పేరు తెచ్చుకున్న అక్సాఖాన్ ఇదే షో లో మరొక డాన్సర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారని వార్తలు వెల్లువెత్తాయి.
ఫ్యాన్స్ తో బుల్లితెర మైకల్ జాక్సన్ గా పిలవబడే పండు కి, అక్సాఖాన్ కి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఒక బలమైన నమ్మకం ఏర్పడింది.
ఎందుకంటే పండు ని ఢీ ఛాంపియన్స్ షో నుంచి ఎలిమినేట్ చేసిన సమయంలో అక్సాఖాన్ బాగా బాధ పడిపోయి శేఖర్ మాస్టర్ తో వాగ్వాదానికి కూడా దిగారు.దీంతో పండు అక్సా ఖాన్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనే ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.
అయితే వీటికి బలాన్ని చేకూర్చుతూ పండు, అక్సా ఖాన్ కలిసి అనేక ప్రోగ్రాములలో డాన్స్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక డ్యాన్స్ అకాడమీని స్థాపించి లైఫ్ లో సెటిల్ అయ్యే దిశగా ముందడుగు వేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం అక్సా ఆర్జీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.పండు పలు టీవీ షోలలో అనేక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ చాలా బిజీగా ఉన్నారు.అయితే వారిద్దరి జీవితాలు సాఫీగానే సాగిపోతున్నాయని.కానీ ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
అక్సా ప్రవర్తన నచ్చని పండు ఆమెను గత కొద్ది రోజులుగా దూరంగా పెడుతున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.దీంతో అక్సా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలుస్తోంది.