భారత క్రికెట్ కు మూడు అత్యున్నత కప్ లను అందించి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ సువర్ణక్షరాలు లిఖించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ నుండి రిటైర్ మెంట్ తీసుకొని ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉంటూ వ్యవసాయం చేస్తూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నాడు.అయితే క్రికెట్ లో ధోనీ ఎంత క్రేజ్ ను కలిగి ఉన్నాడో, బ్రాండ్ అంబాసిడర్ గా ధోనీని మించిన వారు లేరని చెప్పవచ్చు.
అయితే మామూలుగా ధోనీ ఇంట్రోవర్ట్ పర్సన్.చాలా కామ్ గా, కూల్ గా ఉంటాడు.
ధోనీ అంత ప్రశాంతంగా ఉండడం చూసి ధోనీ మైండ్ సెట్ పై పరిశోధనలు జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక అసలు విషయంలోకి వస్తే ధోనీకి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
బౌద్ధ సన్యాసి దుస్తులు వేసుకొనిnగుండుతో కూర్చుని ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అయితే ఆ ఫోటో స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక అకౌంట్ లో ఈ ఫోటోను పోస్ట్ చేసింది.
అయితే ఈ ఫోటో దేనికి సంబంధించిన అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు.త్వరలో ఇక ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఇది వరకు ఐపీఎల్ లో లీగ్ దశలో నిష్క్రమించడంతో ధోనీలో సత్తా తగ్గిందని అందరూ విమర్శించారు.అయితే ఈసారైనా ధోనీ సత్తా చాటుతాడా లో లేదా అనేది ఆసక్తిగా మారింది.