అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ట్రంప్‌తో పాటు ఆయన మద్ధతు దారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ సంతోషం కాసేపే అని రుజువవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు.అభిశంసన నుంచి ట్రంప్ గట్టెక్కినా ఆయనకు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేసింది.ఇదే తరహాలో క్యాపిటల్ భవనంపై దాడి ఘటనను విచారణ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
దీనికి అధికార డెమొక్రాట్లతో పాటు ట్రంప్ సొంత పార్టీకి చెందిన పలువురు కూడా మద్ధతు పలుకుతున్నారు.ఈ ఘాతుకం వెనుక ఎవరున్నారు.ఏ ఉద్దేశ్యంతో దాడికి దిగారు, దీని వల్ల ఎవరికి లాభం అనే విషయాలు ఖచ్చితంగా బయటకు రావాలని, ప్రజలకు సైతం అన్ని విషయాలు తెలియాలని రిపబ్లిన్ సెనేటర్ బిల్ కాసిడీ అన్నారు.
క్యాపిటల్ భవనాన్ని తన మద్దతుదారులు ముట్టడించడంతో ట్రంప్‌లో తప్పుచేశానన్న భావన ఉందని అభిశంసనకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అభిప్రాయపడ్డారు.
దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయిన ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే 9/11 వంటి కమిషన్ ఏర్పాటు చేయాలని గ్రాహమ్ స్పష్టం చేశారు.సెప్టెంబర్ 11 దాడి తరహా కమిషన్ ఏర్పాటు చేయాలంటే కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుందని.
తద్వారా విచారణ అత్యున్నత స్థాయిలో జరుగుతుందని డెమొక్రటిక్ సెనేటర్ క్రిస్ కూన్స్ పేరొన్నారు.ఇక ఈ తరహా కమిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇప్పటికే మద్దతు తెలిపారు.
అంతకుముందు క్యాపిటల్ హిల్స్ ఘటనలో డోనాల్డ్ ట్రంప్‌ను సెనేట్ నిర్ధోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.వంద మంది సభ్యులున్న సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు వ్యతిరేకంగా 57 మంది ఓటువేయగా అనుకూలంగా 43 ఓటు వేశారు.దీంతో శిక్షకు అవసరమైన మూడింట రెండు వంతుల కంటే పది ఓట్లు తక్కువ రావడంతో అభిశంసన తీర్మానం వీగిపోయింది.ఏడుగురు రిపబ్లికన్ సెనెటర్లు ట్రంప్‌ను అభిశంసించేందుకు ఓటు వేసినా.
చివరకు అవసరమైన 67 ఓట్లు రాలేదు.