వైరల్ వీడియో: పాము దెబ్బకి భారీగా ట్రాఫిక్ జాం.. అసలు ఏమైందంటే..?!

నగరాల్లో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాము.

ఎక్కువగా ఉదయం పూట, సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ వలన రోడ్లు అన్ని రద్దీగా ఉంటాయి.

ఎందుకంటే ఆ సమయంలోనే ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, పనులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఉండడం వలన ట్రాఫిక్ నిలిచిపోతుంది.అలాగే ఒక్కోసారి భారీ వర్షం పడినా.

రోడ్లు మరమ్మతులో ఉన్న,ఏదన్నా ఆక్సిడెంట్ జరిగినా గాని, రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చినప్పుడు రోడ్ల మీద వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది.కానీ కర్నాటకలో ఇవేమీ జరగనుకున్నా గాని అక్కడ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సుమారు అరగంటకన్నా ఎక్కువ సేపే రోడ్ల మీద వాహన దారులు పడిగాపులు కాచారు.ఇంతకీ అసలు అక్కడ ఎందుకు ట్రాఫిక్ ఆగిపోయిందో తెలుసా.

Advertisement

అక్కడ రోడ్డు మీదకి ఓ భారీ పాము రావడంతో ఈ గందరగోళం అంతా ఏర్పడింది.ఆ పాము అక్కడనుంచి వెళ్లిపోయే వరకు ట్రాఫిక్ అలాగే నిలిచిపోయింది.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలోని కల్సంకా జంక్షన్‌ లో జరిగింది.రోడ్డపై పాము చేసిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉదయం వేళ ఈ పాము రోడ్డు మీద దర్శనం ఇచ్చింది.

దాదాపు 10 అడుగులున్న పాము నడిరోడ్డుపైకి వచ్చి ఆగిపోయింది.ఐతే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు దానిని చూసి అప్రమత్తమయ్యారు.వెంటనే వాహనాలను నిలిపివేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అది రోడ్డు దిగి వెళ్లిపోయిన తర్వాత వాహనాలను పంపించారు.ఓ వ్యక్తి ఆ పామును కాపాడి స్నేక్ సొసైటీ సభ్యులకు అప్పగించారు.

Advertisement

ఒక పామును దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.అక్కడ ట్రాఫిక్ కనక ఆపకపోతే పాపం ఆ పాము ఎదో ఒక కారు కింద పడి చనిపోయెది.

తాజా వార్తలు