మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.ఇక ఈ సినిమాలో గని అనే పాత్రలో వరుణ్ తేజ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ కోచ్‌గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తుండగా, హీరోయిన్‌గా అందాల భామ సాయీ మాంజ్రేకర్ నటిస్తోంది.
కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, యంగ్ నటుడు నవీన్ చంద్ర కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇలా భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉండటంతో గని చిత్రం ఎలాంటి కంటెంట్‌తో రాబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను అల్లు వెంకటేష్, సిద్ధు ముద్ద సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు వరుణ్ తేజ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే, ఎఫ్3 చిత్రంలో వరుణ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.మరి గని చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.