నగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన టాలెంటడ్ వ్యక్తి లోకేష్ కనగరాజ్.సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దగా వర్క్ అవుట్ కాకున్నా కోలీవుడ్ మంచి హిట్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత కార్తీ ఖైదీతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు ఈ కుర్ర దర్శకుడు తిప్పుకున్నాడు.కేవలం ఒక్క రాత్రి జరిగిన కథతో ఈ సినిమాని తెరకెక్కించి, కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
స్క్రీన్ ప్లే మాయాజాలంతో ప్రేక్షకులని థియేటర్ లో రెండు గంటలు కూర్చునేలా చేశాడు.ఖైదీ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరో విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తెరకెక్కించాడు.ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నడిచే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని లోకేష్ ఆవిష్కరించాడు.ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా ట్రైలర్ మంచి టాక్ సొంతం చేసుకొని కోలీవుడ్ లో రికార్డ్ సృష్టించింది.
ఇదిలా ఉంటే తాజాగా మాస్టర్ తెలుగు వెర్షన్ కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రలో నటించిన శాంతన్ భాగ్యరాజ్ లోకేష్ నెక్స్ట్ సినిమాని రివీల్ చేసేశాడు.
లోకేష్ తనని త్వరగా తెలుగు నేర్చుకోమని చెప్పాడని, అతని నెక్స్ట్ సినిమా తెలుగులో ఉండబోతుందని తనకి తెలియజేసాడని చెప్పుకొచ్చాడు.త్వరలోనే లోకేష్ పెద్ద తెలుగు సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాడని రివీల్ చేసేశాడు.
దీంతో లోకేష్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తోనే ఉండే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.