వివాదాస్పద పరిమితులకు ఉక్కుపాతర వేస్తూ సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు అక్కడ ఉంటున్న విదేశీ కార్మికుల విషయంలో వందల ఏళ్లనాటి నుంచి వస్తున్న ఆచారాలకు ఉక్కుపాతర వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై విదేశీ కార్మికులపై అక్కడి యజమానుల జులుంకు అవకాశం ఉండదు.ఒక యజమాని దగ్గర పనిచేస్తూ వేరే ఉద్యోగానికి మారాలన్న, సొంత దేశానికి వెళ్లాలన్న, శాశ్వతంగా ఆ దేశం నుంచి వెళ్లిపోవాలన్న ఇప్పటివరకు పలు నిబంధనలు ఉండేవి.
ఇప్పటివరకు చేసిన యజమాని అనుమతి అనేది లేకుండా ఇతర ఉద్యోగాలకు,సొంత దేశానికి వెళ్ళడానికి వీలులేదు.అయితే ఇప్పటివరకు ఉన్న ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఇలాంటి వివాదాస్పద పరిమితులకు సౌదీ సర్కార్ పాతర వేసింది.
ఇకపై విదేశీ కార్మికులు యజమానుల అనుమతి లేకుండా తమకు నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు, తమ ఇష్టప్రకారం దేశం విడిచి వెళ్లిపోవచ్చు.ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది మార్చి 14 నుంచి అమలులోకి వస్తాయని ఆ దేశ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ మినిస్టర్ సత్తం అల్హర్బీ వెల్లడించారు.
ఈ నిర్ణయం సౌదీ లేబర్ మార్కెట్‌తో పాటు దేశంలోని 10.5 మిలియన్ల విదేశీ కార్మికుల జీవితాల్లో గొప్పమార్పును తీసుకురావడం ఖాయమని మంత్రి అన్నారు.విదేశీ కార్మికుల నియామకంలో గల్ఫ్ దేశాలు ప్రస్తుతం అనుసరిస్తున్న ‘కఫాలా’(స్పాన్సర్షిప్) విధానంపై మానవహక్కుల సంఘాలు పెదవి విరిచిన నేపథ్యంలో సౌదీ సర్కార్ ఈ కొత్త నిబంధనలను తీసుకురావడం జరుగుతోంది.అయితే మొత్తానికి ఈ కొత్త నిర్ణయం తో విదేశీ కార్మికులకు అక్కడి పద్దతుల నుంచి విముక్తి కలగనుంది అన్నమాట.