సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా, లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అనుష్క.బాహుబలి సినిమాతో ఏ భామ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
లేడీ ఒరియాంటెడ్ కథలు ఈమెతో తెరకెక్కించిన 50 కోట్లు కలెక్ట్ చేయగలిగే సామర్ధ్యం సొంతం చేసుకుంది.సౌత్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా అనుష్క ఉంది.
ఇదిలా ఉంటే అనుష్క లీడ్ రోల్ లో నటించిన నిశ్శబ్దం సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.గాంధీ జయంతి రోజు నుండి అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది.
నిశ్శబ్దం మనం ఊహించుకునేంత భయానకం కాదని అనుష్క సైలెన్స్ చూసిన తర్వాత ప్రేక్షకులకి అర్ధమైంది.సినిమా రిలీజ్ అయినా రోజు నుంచి సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
హేమంత్ మధుకర్ కథ అద్భుతంగా రాసుకున్న కోన వెంకట్ స్క్రీన్ ప్లే ఆ కథని పూర్తిగా చెడగొట్టింది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలని అందుకోలేదనే మాట వినిపిస్తుంది.
ఐతే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందట.ఈ విషయమై చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమంత్ మధుకర్, నిశ్శబ్దం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు.అయితే సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో దీనికి సీక్వెల్ తీసే ధైర్యం నిర్మాతలు చేస్తారా అనే డౌట్ ఇప్పుడు వస్తుంది.
ఓ విధంగా చెప్పాలంటే నిశ్శబ్దం సినిమా తీసి నిర్మాతలు అమెజాన్ కి అమ్మేసి ఎంతో కొంత లాభ పడ్డారనే చెప్పాలి.అయితే అమెజాన్ కి ఈ సినిమా ఎంత వరకు మంచి రెవెన్యు తీసుకొచ్చింది అనేది తెలియని విషయం.