అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య సమాచారంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.ట్రంప్ సీరియస్ కండిషన్ లో ఉన్నారని ఒక సారి లేదు త్వరలో డిశ్చార్జ్ అవుతారని మరొక సారి ఇలా ఎవరికి వారు ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపధ్యంలో నేను బాగానే ఉన్నాను అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ని విడుదల చేయడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు అందరూ.
అయితే ఆ వీడియో ఉత్తుత్తి వీడియో పూర్తిగా ఎడిటింగ్ చేశారు.ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని అమెరికన్స్ ఆరోపణలు చేస్తున్నారు.
ట్రంప్ ఆరోగ్యంపై ఏకంగా వైట్ హౌస్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ స్పందిస్తూ ట్రంప్ ఆరోగ్యం అస్సలు బాలేదని, ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని ప్రకటించంతో ట్రంప్ మార్క్ పై మండిపడ్డారని తెలుస్తోంది.ఈ నేపధ్యంలోనే రకరకాలుగా వస్తున్నా ఊహాగానాలకు తెర దించేందుకు ఏకంగా ట్రంప్ ఓ వీడియోని పోస్ట్ చేశారు అందులో నేను బాగున్నాను ఎవరూ ఆందోళన చెందకండి.
ఇది నిజంగా మనకి అతిపెద్ద పరీక్ష.ఎన్నికలు దగ్గరపడిన సమయంలో ప్రచారంలో పాల్గొనలేక పోవడం విచారంగా ఉంది.త్వరలో నేను కోలుకుంటాను మీ ముందుకు వస్తాను.మనం అమెరికాని కాపాడుకుందాం అంటూ ప్రసంగించారు.కానీ
ట్రంప్ అభిమానులు, అమెరికన్స్ ఆయన మాట్లాడిన వీడియో ఎడిటింగ్ చేయబడిందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అధ్యక్షుడికి దగ్గు బాగా ఉందని ఈ విషయం తెలియకుండా ఉండేందుకు వీడియోని ఎడిట్ చేశారని అంటున్నారు.
ట్రంప్ మాట్లాడుతూ మధ్యలో కొంచం దగ్గినట్టుగా కన్పించిందని, ఆయన భుజం కాస్త పైకి కదిలినట్టుగా అనిపించిందని అంటున్నారు.ట్రంప్ ఆరోగ్యంపై వైద్యులు అనేక విషయాలు దాచిపెడుతున్నారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.