వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో వరుసబెట్టి సినిమాలను చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ఈమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వర్మ పవర్ స్టార్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు పవన్ ఫ్యాన్స్‌లో తీవ్ర చర్చ నడిచింది.అయితే ఇప్పుడు తనపై తానే ఓ సినిమా చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు ఈ డైరెక్టర్.
‘ఆర్జీవీ మిస్సింగ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేసిన వర్మ, తాజాగా మరోసారి పవన్‌ను టార్గెట్ చేస్తూ కనిపించాడు.తాజాగా ఈ సినిమాలోని సెకండ్ పోస్టర్‌ను వర్మ రిలీజ్ చేశాడు.
ఈ పోస్టర్‌లో పీకేను ఎక్యూస్డ్ నెం 1గా చూపిస్తున్నాడు వర్మ.తాను కిడ్నాప్ అయ్యినట్లు, అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం అతడి కొడుకులుగా ఉన్నట్లు వర్మ ఈ పోస్టర్‌లో తెలిపాడు.
మొత్తానికి వర్మ తనపై సినిమా చేస్తూనే మిగతావారికి గట్టి ఎసరు పెట్టినట్లు స్పష్టం అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ఇప్పటికే తెలిపాడు.
అక్టోబర్ 10న సాయంత్రం 5 గంటలకు ఆర్జీవీ మిస్సింగ్ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు.మరోవైపు థియేటర్లు తెరుచుకోబోతున్న నేపథ్యంలో తన నెక్ట్స్ మూవీ ‘కరోనావైరస్’ను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తానంటూ వర్మ ఇప్పటికే ప్రకటించాడు.
ఏదేమైనా వర్మ ఇలా జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ వాటిపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు.మరి ఆర్జీవీ మిస్సింగ్ కేసు ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.