తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది.మొదట ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఏమాత్రం బాగాలేరు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
కాని ఇప్పుడు ఉన్నవారితోనే ఆసక్తికరంగా షోను మార్చడంలో బిగ్‌బాస్ నిర్వాహకులు సిద్దం అవుతున్నారు.ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్న ఈ సమయంలో శని మరియు ఆదివారాల ఎపిసోడ్స్ లో నాగార్జున ఇంటి సభ్యుల మద్య పుల్లలు పెడుతూ అందరిని ఎక్కడికి అక్కడ చీల్చి వదిలేశాడు.
ఇక బిగ్‌బాస్ రెండవ వారంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ శనివారం ప్రకటించి మొదటి రోజు కరాటే కళ్యాణిని రెండవ రోజు మరొకరిని ఎలిమినేట్ చేస్తానంటూ నిన్నటి ఎపిసోడ్ ప్రారంభించిన నాగార్జున చాలా ఇంట్రస్టింగ్‌గా ఎలిమినేషన్ పక్రియ నిర్వహించడం జరిగింది.ఎలిమినేషన్ కు సంబంధించి మొదట లీక్ అయినా కూడా ఆసక్తికరంగా సాగింది.
హారిక ఎలిమినేట్ అవుతుందని కాని అది ఫేక్ ఎలిమినేషన్ అంటూ ముందే ప్రచారం జరిగింది.
గత సీజన్ లో రాహుల్ మాదిరిగా ఆమెను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంకు తీసుకు వెళ్లి ఆ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇప్పిస్తారని భావించారు.
కాని అంత దూరం వరకు వెళ్లలేదు.ఎలిమినేషన్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగి చివరకు మోనాల్ మరియు దేత్తడి హారిక ఉన్న సమయంలో ఇంటి సభ్యులు వారిని పంపించేందుకు గాను ఎంపిక చేయాల్సి ఉంటుంది అనగా ఏడుగురిలో ముగ్గురు మోనాల్ వెళ్లాలి అన్నారు.
నలుగురు మాత్రం దేత్తడి హారిక వెళ్లాలి అంటూ చెప్పారు.దాంతో హారిక ఎలిమినేషన్ అయ్యింది అంటూ నాగార్జున ప్రకటించాడు.అన్ని సర్దేసుకుంది.చక చక హౌస్ నుండి బయటకు వెళ్లి పోవాలంటూ బిగ్‌బాస్ సూచించడంతో అంతా కూడా ఆమెను ఔట్ గేట్ వద్దకు తీసుకు వెళ్లి ఏడ్చేశారు.
అప్పటి వరకు బాగానే ఉన్న హారిక కూడా ఏడ్చేసింది.అంతలో అంతా లోనికి రండీ, ఇది ఫేక్ ఎలిమినేషన్ హారిక మళ్లీ ఎప్పుడు కూడా సెల్ఫ్ నామినేట్ అవ్వద్దు అంటూ నాగార్జున హెచ్చరించాడు.
మొత్తానికి హారికకు మరియు ఆమె అభిమానులకు కొద్ది సమయం మొత్తం తడిసి పోయింది అనుకోండి.