టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేసుకుంటూ వస్తోంది.
ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.అయినా కూడా ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో ఈ మేరకు ఒప్పందం కూడా ముగిసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాను అక్టోబర్ 10 లేదా అక్టోబర్ 17న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు అనుష్క రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.అటు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను అతి త్వరలో ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో అనుష్క ఓ మూగ అమ్మాయిగా నటించనుంది.మాధవన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తుండగా, కోన వెంకట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే అంశంపై మాత్రం మరింత స్పష్టత రావాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.