కింగ్ నాగార్జున కెరియర్ లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.చాలా కాలం తర్వాత నాగార్జున మరోసారి రొమాంటిక్ హీరోగా ఇందులో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు.
రొమాంటిక్ కామెడీతో, ఫ్యామిలీ క్రైమ్ స్టొరీగా వచ్చిన ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడుగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా నాగార్జున కెరియర్ అత్యధిక వసూళ్లు తెచ్చిన పెట్టిన సినిమాగా నిలిచిపోయింది.
ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు టైటిల్ తో సినిమా తీయాలని నాగార్జున ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు.అయితే మధ్యలో కళ్యాణ్ కృష్ణ రవితేజతో సినిమా చేయడం అది కాస్తా ఫ్లాప్ అవడంతో కొంత గ్యాప్ వచ్చింది.
అయితే మధ్యలో కళ్యాణ్ కృష్ణ వినిపించిన లైన్ నాగార్జునకి నచ్చకపోవడంతో మరింత గ్యాప్ వచ్చింది.
అయితే మళ్ళీ కూర్చొని కళ్యాణ్ కృష్ణ కొత్త వెర్షన్ తో నాగార్జునని మెప్పించడంతో దానిపై ఇన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ చేశారు.
ఇక స్క్రిప్ట్ వర్క్ అయిపోవడంతో ఇక సెట్స్ పైకి వెళ్లాలని అనుకున్న టైంలో లాక్ డౌన్ రావడంతో సినిమా ఓపెనింగ్ కి గ్యాప్ వచ్చింది.అయితే ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా పూర్తి చేసేయడంతో నాగార్జున కూడా బంగార్రాజు సినిమాని త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.
ఈ నేపధ్యంలో ఎట్టి పరిస్థితిలో ఆగష్టులో సెట్స్ పైకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
నాగార్జున కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
దాంతో అదే పాత్ర పేరుతో .అదే దర్శకుడితో సినిమా చేయడానికి నాగార్జున రంగంలోకి దిగారు.ఈ సినిమాలో నాగార్జున మనవడుగా నాగ చైతన్య నటిస్తున్నట్లు తెలుస్తుంది.