టాలీవుడ్లో కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అదిరిపోయే సక్సెస్ అందుకున్న దర్శకుడిగా తేజ తనదైన మార్క్ వేసుకున్నాడు.ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాల్లో ఏదో ఒక కొత్త అంశం ఉంటుందని చాలా మంది ఆయన సినిమాలు చూస్తుంటారు.
కానీ గతకొంత కాలంగా సరైన హిట్లు లేక చతికలబడ్డ తేజ, మళ్లీ సక్సెస్ కొడుతూ దూసుకుపోతున్నాడు.
అయితే తేజ కూడా మిగతా వారిలో వివాదాలకు కేరాఫ్‌గా అప్పుడప్పుడు నిలుస్తుంటాడు.
కొత్తవారిని సెట్స్‌లో కొట్టడం మొదలు స్టార్ హీరోలతో గొడవల వరకు ఆయనపై పలు పుకార్లు ఉన్నాయి.అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని అవాక్కయ్యే అంశాలను తెలియజేశాడు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల గురించి తేజ చేసిన కామెంట్స్ సెన్సేషన్‌గా మారాయి.వారిద్దరూ కూడా తమ స్థాయిని తగ్గకుండా చూసుకునేందుకు ఎప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయలేదని ఆయన అన్నాడు.
తనకు సూపర్‌స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి వారితో సినిమాలు చేయాలని ఉందని ఆయన అన్నాడు.అలాగే తన జీవితంలో జూ ఎన్టీఆర్, చిరంజీవిలతో సినిమా చేయనని కుండబద్దలు కొట్టాడు.
కాగా ప్రస్తుతం తేజ రానా దగ్గుబాటి, గోపీచంద్‌లతో కొలిసి రెండు సినిమాలు చేయనున్నాడు.మరి తేజ చేసిన కామెంట్స్‌పై చిరు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.