ఒక మహిళ టిక్ టాక్ కోసం తన భర్తకే ఊహించని షాక్ ఇచ్చింది.తనకు టిక్ టాకే ముఖ్యమని భర్తను కూడా వదులుకోవడానికి సిద్ధమైంది.12 సంవత్సరాల వివాహ బంధాన్ని కూడా సదరు మహిళ టిక్ టాక్ కోసం వదులుకుంది.భర్త ఆమెకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు.
కానీ భార్య మాత్రం తనకు ఫాలోవర్లు ఉన్న టిక్ టాకే ముఖ్యమని భర్త అవసరం లేదని చెప్పింది.భార్య అలా చెప్పటంతో భర్తకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పూర్తి వివరాలలోకి వెళితే నజ్మా, ఫారిస్ 12 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.బెంగళూరులో ఈ జంటగా నివాసం ఉండగా ఫారిస్ కు సౌదీ అరేబియాలో ఉద్యోగం వచ్చింది.
అత్తామామలతో కలిసి నజ్మా బెంగళూరులోనే ఉండేది.ఆ తరువాత నజ్మాకు ఒక తెలిసిన మహిళ ద్వారా టిక్ టాక్ పరిచయమైంది.
టిక్ టాక్ కు ఆకర్షితురాలైన నజ్మా క్రమక్రమంగా టిక్ టాక్ యాప్ లో ఫాలోవర్లను పెంచుకోవటం ప్రారంభించింది.
క్రమక్రమంగా టిక్ టాక్ లో అశ్లీల వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించింది.కొన్ని నెలల క్రితం ఫారిస్ కు తన భార్య అశ్లీల నృత్యం చేస్తున్న వీడియో అతని స్నేహితుడు పంపించాడు.తన భార్యను ఫారిస్ ఈ విషయం గురించి అడగగా ఎవరో మార్ఫింగ్ చేశారని భర్తతో చెప్పింది.
ఫారిస్ పోలీసులను ఆశయించగా తన భార్యే నకిలీ అకౌంట్ తో టిక్ టాక్ వీడియోలు చేస్తున్నట్టు తెలిసింది.ఆ తరువాత మహిళ తనకు టిక్ టాక్ ముఖ్యమని భర్తతో బంధాన్ని విడదీసుకోవడం గమనార్హం.
టిక్ టాక్ పిచ్చి ఇద్దరు భార్యభర్తలను విడదీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.