భారతీయురాలికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవం కల్పించింది.భారత ప్రభుత్వం తరపున ఐరాసలో పనిచేస్తున్న గీతా సభర్వాల్‌ను థాయిలాండ్‌లో రెసిడెంట్ కో ఆర్డినేటర్‌గా సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నియమించారు.
ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కో ఆర్డినేటర్ అంటే దేశ స్థాయిలో ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ వ్యవస్థ యొక్క అత్యున్నత ప్రతినిధి.
రెసిడెంట్ కో ఆర్డినేటర్లు యూఎన్ దేశ స్థాయి టీమ్‌లకు నాయకత్వం వహిస్తారు.2030 ఎజెండాను అమలు చేయడంతో పాటు సమితి నుంచి అందే సహయత సహకారాలను సమన్వయం చేస్తారు.వీరిని ఐరాస సెక్రటరీ జనరల్ నియమిస్తుండటంతో వారంతా ఆయనకే రిపోర్ట్ చేస్తారు.
![Telugu Telugu Nri, Indiasgita- Telugu Telugu Nri, Indiasgita-](https://telugustop.com/wp-content/uploads/2020/01/United-Nations-Appoints-Indias-Gita-Sabharwal-To-Top-Post-In-Thailand-2.jpg)
గీతా సభర్వాల్ విషయానికి వస్తే మాల్దీవులతో పాటు ఐదు ఆసియా దేశాలలో అభివృద్ధి, శాంతి, నిర్మాణం, పాలన, సామాజిక విధానం వంటి అంశాలలో 25 సంవత్సరాల అనుభవం ఉంది.ఇటీవల కాలంలో ఆమె శ్రీలంకలో ఐక్యరాజ్యసమితి తరపున శాంతి-నిర్మాణ మరియు అభివృద్ధి సలహాదారుగా దాదాపు ఏడు సంవత్సరాలు సేవలు అందించారు.ఐక్యరాజ్యసమతిలో చేరడానికి ముందు సభర్వాల్ ఆసియా ఫౌండేషన్ తరపున మాల్దీవులు, శ్రీలంకలకు డిప్యూటీ కంట్రీ ప్రతినిధిగా వ్యవహరించారు.అలాగే యూకే ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ విభాగం తరపున పేదరికం, విధాన సలహాదారుగా భారత్, వియత్నాంలో పదవులు నిర్వహించారు.
![Telugu Telugu Nri, Indiasgita- Telugu Telugu Nri, Indiasgita-](https://telugustop.com/wp-content/uploads/2020/01/United-Nations-Appoints-Indias-Gita-Sabharwal-To-Top-Post-In-Thailand-3.jpg)
ఆసియా ఫాండేషన్ అనేది లాభాపేక్షలేని అంతర్జాతీయ అభివృద్ది సంస్థ.ఇది ఆసియా అంతటా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుంది.గీతా సభర్వాల్ యూకేలోని వేల్స్ యూనివర్సిటీ నుంచి అభివృద్ధి నిర్వహణలో మాస్టర్స్ డిగ్రీని చేశారు.అలాగే దక్షిణాసియా, ఆగ్నేయాసియాపై అనేక విధాన పత్రాలను రచించారు.