జనసేన పార్టీ తరఫున పోటీచేసిన అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోగా ఆ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం మీద గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థిగా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మంచి గుర్తింపు పొందారు.తమకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరిపోతుందని అసెంబ్లీలో ప్రభుత్వం ఒక ఆట ఆడుకుంటాను అంటూ మొదట్లో పవన్ చెప్పారు.
దీనికి తగ్గట్టే రాపాక వరప్రసాద్ కూడా జనసేన పార్టీకి విధేయుడిగా ఉంటాను అనుకుంటూ చెప్పుకొచ్చారు.కానీ ఆ తర్వాత తర్వాత ఆయన జనసేన పార్టీ ని పట్టించుకోకుండా ఏపీ అధికార పార్టీ వైసీపీకి దగ్గరగా వెళ్లారు.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ జగన్ వ్యక్తిగతంగా విమర్శ చేస్తూ ఒక ఆట ఆడుకుంటుంటే అదే సమయంలో రాపాక జగన్ ను పొగుడుతూ ఆయన ఫోటోలు కు పాలాభిషేకం చేస్తూ హడావిడి చేయడం పవన్ కు షాక్ ఇచ్చింది.
ఇక జగన్ మూడు రాజధానుల ప్రకటన, శాసన మండలి రద్దు ఇలా అన్ని విషయాల్లోనూ రాపాక జనసేన పార్టీ స్టాండ్ ను వదిలిపెట్టి వైసిపి కి మద్దతు పలికారు.ఈ పరిణామాలన్నీ ఇప్పుడు జనసేన లో సంచలనం సృష్టిస్తున్నాయి.పార్టీ లైన్ దాటినా ఆయన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు ? ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సూచిస్తున్నారు.విశాఖలో జరిగిన ఇసుక లాంగ్ మార్చ్ తర్వాత నుంచి రాపాక లో మార్పు గణనీయంగా కనిపిస్తోంది.
పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా పాల్గొనడం లేదు.పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ రాపాక రాలేదు.తాజాగా శాసనమండలి రద్దు అనుకూలంగా ఓటు వేయడంతో జనసేన క్యాడర్ నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.
ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలిని, క్రమశిక్షణ విషయంలో వెనకడుగు వేయొద్దంటూ సూచిస్తున్నారు.ఇక కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించినా రాపాక కనీసం కండించలేదు సరికదా సైలెంట్ గా ఉండడం పవన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని సూచిస్తున్నారు.ఎప్పుడయితే పవన్ ను రాపాక పట్టించుకోవడంలేదో ఇక అప్పటి నుంచి ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు.సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టింగ్ లు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు.గతంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా కేవలం 318 ఓట్లు మాత్రమే వచ్చాయి అనే విషయాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు.
కానీ పవన్ మాత్రం ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్న తీరు జన సైనికులకు నచ్చడం లేదు.