అమెరికాలో సరిహద్దు గోడ వివాదం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
అమెరికా ఆర్ధిక వ్యవస్థ స్థంబించి పోవడానికి కేలవం ఒకే ఒక్క గోడ వివాదం అంటే నమ్మి తీరాల్సిందే.మెక్సికో నుంచే వలస దారులు రాకుండా సరిహద్దు గోడ కడుతానని వాగ్ధానం ఇచ్చారు.
అయితే డెమోక్రాట్లు గోడ కట్టడానికి అడ్డు పడటంతో ఇప్పుడు ట్రంప్ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది.ట్రంప్ పై ప్రజల తో పాటు ఒబామా సైతం గుర్రుగా ఉండటమే కాకుండా ట్రంప్ పై విమర్శలు పెట్టారు.దాంతో ట్రంప్ వాషింగ్టన్‌లోని ఒబామా, ఒబామా దంపతులు నివాసముంటున్న ఇంటిపై కామెంట్స్ చేశారు.
మీ ఇంటికి రక్షణ కోసం పెద్ద గోడ ఉంది అలాంటిది అమెరికా ప్రజల రక్షణ కోసం వలసల నిలువరించడానికి పెద్ద గోడ కట్టాలని అనుకోవడంలో తప్పేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.ట్విట్టర్ లో ట్రంప్ ఈ రకంగా తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఒబామాపై ఫైర్ అయ్యారు.
.తాజా వార్తలు