బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాలున్న ఈ చిత్రం ఇప్పటికే రికార్డు స్థాయి బిజినెస్‌ను చేసింది.
బాలయ్య కెరీర్ లో ఎప్పుడు కూడా చూడని నెంబర్స్‌ను ఈ చిత్రం చూసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఓవర్సీస్‌లో బాలయ్య మిలియన్ మార్క్ క్రాస్ అవ్వడమే మహాగగణం.
అలాంటిది ఈ చిత్రంతో రెండున్నర నుండి మూడు మిలియన్‌లను క్రాస్ చేస్తాడంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘ఎన్టీఆర్’ చిత్రాన్ని నందమూరి అభిమానులు ఎలాగైనా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తెచ్చుకునేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకోసం ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ప్రీమియర్ షోల ఏర్పాటు చేయిస్తున్నారు.దాంతో పాటు భారీ ఎత్తున టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.
ఒకొక్కరు అవసరం ఉన్నా లేకున్నా లెక్కకు మించిన టికెట్లు కొంటున్నారట.దాంతో పాటు కొన్ని స్క్రీన్స్‌కు సంబంధించిన టికెట్లను వేలం పాట వేయాలని కూడా చూస్తున్నారు.
ఆ వేలం పాటలో ఒక్కొ టికెట్లు ధర మూడు నాలుగు రెట్లు ఎక్కువ పలికే అవకాశం ఉందని ఓవర్సీస్ నందమూరి అభిమానులు చెబుతున్నారు.భారీ ఎత్తున టికెట్లను ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి బాలయ్యకు రికార్డును కట్టబెట్టి ఆయన దృష్టిలో పడేందుకు ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.అలా చేసి ఏపీ ప్రభుత్వం నుండి ఏదైనా లాభం పొందానేది కూడా కొందరి అభిప్రాయంగా తెలుస్తోంది.మొత్తానికి ‘ఎన్టీఆర్’ మూవీ ఓవర్సీస్‌లో రికార్డును సొంతం చేసుకోవడం ఖాయంగా తెలుస్తోంది.