చాలాకాలం తరువాత విడుదల చేసిన ఏపీ డీఎస్సీ పై నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు.అయితే అకస్మాత్తుగా డీఎస్సీ పరీక్ష రెండు వారాల పాటు వాయిదా వేశారు.
ఇంతకీ విషయం ఏంటి అంటే… అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 6 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వెజెస్) అభ్యర్థులకు డిసెంబర్ 19, 21 తేదీల్లో, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) అభ్యర్థులకు డిసెంబర్ 22న పరీక్షలు నిర్వహించనున్నారు.అలాగే, టీజీటీ అభ్యర్థులకు డిసెంబర్ 26, 27 తేదీల్లో, పీజీటీ అభ్యర్థులకు డిసెంబర్ 23, 24 తేదీల్లో నిర్వహించబోతున్నట్టు పేర్కొన్నారు.డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 10 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఇచ్చారు.