ఎక్కడైనా ఒక చేప ధర వందల్లోనో .వేలల్లోనే మరీ అరుదు అనుకుంటే లక్షల్లోనే ఉంటుంది.
అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎర్రని మచ్చల చేప మాత్రం మామూలు రేటులో లేదు.ప్రపంచంలోనే ఈ చేప అత్యంత ఖరీదైనది.దీని వెల రూ.13,54,04,340.ఈ చేప పొడవు 3 అడుగుల 3 అంగుళాలు.జపాన్‌లోని హిరోషిమ నగరంలో ఈ చేపకు వేలంపాట నిర్వహించారు.
తైవాన్‌కు చెందిన యింగ్‌యింగ్ అనే మహిళ దీనిని దక్కించుకుంది.అరుదైన జాతులకు చెందిన, భిన్నంగా ఉండే చేపలను సేకరించడం ఆమె అలవాటు.ఈ మత్స్యాన్ని ఎస్ లెజెండ్‌గా పిలుస్తారు.ఇవి కొహాకు రకానికి చెందినవి.ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన రకాల్లో కొహాకు కూడా ఒకటి.ఈ రకం చేపలు 5 లక్షల వరకు గుడ్లు పెట్టగలవు.