మన దేశంలో చాలా వరకు హిందువులే కాదు, పలు ఇతర వర్గాలకు చెందిన వారు కూడా దృష్టి ఉందని నమ్ముతారు.దృష్టి అంటే.
అదేనండీ.మన వాళ్లు దిష్టి అంటారు కదా.అదే.దాన్నుంచి తప్పించుకునేందుకు అందరూ రక రకాల పద్ధతులు పాటిస్తారు.ఉప్పు, చెప్పులు, చీపురు వంటి వాటిని ఉపయోగించి దిష్టి తీస్తారు.కొందరు తాయెత్తులు కట్టుకుంటారు.ఇక కొందరు ఇండ్లలో, ఆఫీసుల్లో, షాపుల్లో దిష్టిబొమ్మలు వేలాడదీస్తారు.వాహనాలకైతే జీడిగింజలు, నిమ్మకాయలు, నల్లదారం కలిపి కడతారు.
నేటి తరుణంలో చాలా మంది తమకు దిష్టి తగలకుండా ఉండేందుకు గాను ఎడమ కాలికి నల్లదారం కూడా కట్టుకుంటున్నారు.అయితే ఇవన్నీ దిష్టిని తగ్గించుకునేందుకు మనకు తెలిసిన పలు విధానాలే.
కానీ ఓ రైతు మాత్రం పొలానికి దిష్టి తగలకుండా ఏకంగా హీరోయిన్ ఫోటో ని పెట్టాడు.హీరోయిన్ ఫోటో అంటే మనం సాదరంగా పోస్టర్ గానో లేక వాల్ పేపర్ గా పెట్టుకుంటాము.అతనేమో దిష్టి బొమ్మ లాగ పెట్టాడు.ఈ ఘటన .సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి లో జరిగింది.
బిక్కుమియా అనే రైతు ప్రతి ఏటా 3 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నాడు.
ప్రతిసారి పంట బాగా పండడం కోత సమయానికి ఏదో ఒక తెగుళ్లు రావడం.దాంతో దిగుబడి తగ్గిపోవడం.
ప్రతి ఏడూ ఇలాగే జరుగుతోంది.దీంతో బిక్కుమియా తీవ్రంగా నష్టపోయాడు.
పంట బాగా పండుతోంది.సరిగ్గా చేతికొచ్చే సమయానికే ఎందుకిలా అవుతోందని ఆలోచించాడు.
కొందరిని ఆరా తీస్తే అందుకు నరదిష్టే కారణమని చెప్పారట.అందుకే ఇలా కాజల్‌ను తీసుకొచ్చి సెట్ చేశారు.
ఆ పొలం గ్రామ శివార్లలోని శివాలయానికి దగ్గరగా రోడ్డు పక్కనే ఉంటుంది.దీంతో వచ్చిపోయే వారి దృష్టి తన పంటపై పడుతోందని వారి దిష్టి తగిలే దిగుబడి తగ్గిపోతోందని గట్టిగా నమ్మేశాడు.
అంతే వెంటనే పొలంలో దిష్టిబొమ్మ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని విషయం కొడుకు అన్వర్‌కు చెప్పాడు.బాగా ఆలోచించిన అన్వర్ దిష్టిబొమ్మకు బదులు దారినపోయే వారి దృష్టి మరల్చేలా తన అభిమాన హీరోయిన్ కాజల్ ప్లెక్సీ తీసుకొచ్చి పెట్టేశాడు.
పొలంలో కాజల్ ప్లెక్సీ చూసినవారి ఫోకస్ మొత్తం పంటపై నుంచి ప్లెక్సీ మదకు మళ్లింది.కొడుకు ఆలోచనకు బిక్కుమియా కూడా మురిసిపోతున్నాడు.ఇప్పుడు పంట బాగా పండిందని కొద్దిరోజుల్లోనే కూరగాయలు చేతికొస్తాయని చెప్తున్నారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బండ కింది పల్లె అనే ఓ మారుమూల గ్రామం లో నివాసం ఉంటున్న చెంచు రెడ్డి అనే 45 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ రైతు తన చేనులో పంట వేశాడు.
మొత్తం 10 ఎకరాల్లో పంట అద్భుతంగా పండింది.మంచి దిగుబడి రానుంది.అయితే ఆ చేను పక్కగా వెళ్లేవారందరూ చేనును చూసి ఆహో, ఓహో అంటూ పొగుడుతున్నారు.దీంతో వారి చూపు పడి తన చేనుకు, పంటకు దిష్టి తగులుతుందని అతను భావించాడు.
అందుకు అతను ఏం చేశాడో తెలుసా.? తన చేను పక్కనే సన్నీలియోన్ ఫోటోను కట్టించాడు.