అవును! రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు.కొన్ని వ్యాఖ్యలు పార్టీ ల పతనానికి నాంది పలుకుతాయని అంటారు.
ఇప్పడు ఇదే తర్జన భర్జన ఏపీ అధికార పార్టీ టీడీపీలో జోరుగా సాగుతోంది.అధికార్టీ నాయకుడు, చంద్రబాబు ఫ్యూచర్ ప్లాన్‌లో భాగంగా వేసే ప్రతి అడుగూ.
ఆ పార్టీని ప్రజలకు చేరువ చేయడమా? దూరం చేయడమా? అనేది డిసైడ్ చేస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.ఇలాంటి పరిణామం ఒక్కసారిగా రావడం వెనుక రీజన్ కూడా ఉంది.
ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టాలని ప్రయత్నించి విఫలమైంది.
ఈ విషయంలో ఎవరికీ సింపతీ లేదు.పైగా మోడీపై వ్యతిరేక ప్రభావం కూడా పడింది.
తమకు మెజారిటీ లేదని తెలిసినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అనడమే తప్పు.
ఇక, అసెంబ్లీలో బలపరీక్ష లేకుండా యడ్యూరప్ప రాజీనామా చేయడం ద్వారా కొంతలోకొంత బీజేపీ పరువు నిలబెట్టు కుంది.
ఇక, ఇక్కడే మొదలైంది అసలు రాజకీయం.కర్ణాటకలో జేడీఎస్‌ను కాపాడింది తానేనని, జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామికి అనుక్షణం సలహాలిచ్చిందికూడా తానేనని చంద్రబాబు అప్పుడే ప్రచారం ప్రారంభించారు.
ఇక, అదే సమయంలో బీజేపీకి బుద్ది చెప్పేలా తాను వ్యవహరించానని, తన మాట విని.కర్ణాటక తెలుగు ప్రజలు బీజేపీకి ఓటు వేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు, ఈ నెల 23న కొలువుదీరనున్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు.అయితే, చంద్రబాబుకు ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి.
ఇప్పుడు కర్ణాటకలో ఏర్పాటు అవుతున్న ప్రభుత్వం నేరుగా జేడీఎస్ కాదు.ఆ పార్టీకి కేవలం 37 మంద ఎమ్మెల్యేలే ఉన్నారు.మిగిలిన78 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌వారే., అలాంటి సమయంలో కర్ణాటకలో ఏర్పాటుకానున్న ప్రభుత్వం జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం.
మరి బాబు పరోక్షంగానో.ప్రత్యక్షంగానో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినట్టేగా? ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో బీజేపీకి ముఖ్యంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశంలో తాను కూడా చక్రం తిప్పుతానని ప్రకటించాడు అంటే.మమతా బెనర్జీ చెబుతున్నట్టు కాంగ్రెస్‌తో కూడిన ఫ్రెంట్‌కు బాబు మద్దతివ్వాలి.
మరి ఇవన్నీ చూస్తుంటే.
చంద్రబాబు.కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్టే కదా?! మరి ఇప్పుడు ఆయన ప్రవచిస్తున్న పార్టీ సిద్ధాంతాలు, నైతికత, విలువలు ఉండవా? టీడీపీ సిద్ధాంతం ఏంటి? కాంగ్యెస్ వ్యతిరేక పునాదులపై నిర్మించుకున్న టీడీపీ కోటను ఇప్పుడు కాంగ్రెస్‌తోనే కలిపేందుకు బాబు రెడీ అవుతున్నారా ? మరి ఇదే జరిగితే.ప్రజలకు ఏమని చెబుతారు? అన్నగారి ముఖాన్ని ఎలా చూస్తారు? ఆయన ఆత్మ క్షోభించదా? ఆయన స్థాపించిన పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్టు కాదా? బాబుగారి వ్యూహంతో పార్టీ పుట్టిమునగడం తథ్యం అంటున్నారు పరిశీలకులు.మరి బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.