‘జైలవకుశ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఫస్ట్‌ుక్ మరియు టైటిల్‌ను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా దర్శకుడు త్రివిక్రమ్ రివీల్ చేశాడు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా త్రివిక్రమ్ ఖచ్చితంగా మంచి గిఫ్ట్ ఇవ్వాలనే పట్టుదలతో ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది.అంతా ఎదురు చూసిన విధంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టైటిల్ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మూవీకి ‘అసామాన్యుడు’, ‘రారా కుమారా’ అనే టైటిల్స్‌ను పరిశీలించారు.మీడియాలో వచ్చిన వార్తలు పుకార్లే అంటూ తేల్చి పారేసి తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను ‘అరవింద సమేత’ అంటూ దర్శకుడు ప్రకటించాడు.
ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సరైన బహుమతిని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ ఇచ్చాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకేలా పెంచుకుంటున్నారు.ఇక ఈ చిత్రానికి టైటిల్‌గా అరవింద సమేత అని పెట్టడం వెనుక ఉన్న కారణాలను సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు విశ్లేషించే పనిలో ఉన్నారు.
ఈ సినిమా టైటిల్‌ను చూస్తుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత చిత్రం ‘జయ జానకి నాయక’లా ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ సినిమాలో హీరోయిన్ చుట్టు కథ ఎలా సాగుతుందో ఈ చిత్రంలో కూడా హీరోయిన్ చుట్టు కథ సాగేలా దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది.హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డేకు ఈ చిత్రంలో కీలక భూమిక ఉండబోతుందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు.
టైటిల్ చూస్తుంటే చాలా క్లాసీగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అయినా కూడా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తనదైన శైలిలో విభిన్నంగా తెరకెక్కిస్తాడని అంతా భావిస్తున్నారు.
ఎన్టీఆర్ గతంలో ‘బృందావనం’ చేసిన సమయంలో మాస్ హీరోకు ఇలాంటి టైటిల్ ఏంటని అంతా కూడా విమర్శలు చేశారు.ఆ తర్వాత వారే వావ్ అనేశారు.
ఇప్పుడు ఈ టైటిల్‌కు కూడా ఎన్టీఆర్ న్యాయం చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.ఎలాంటి పాత్రలో అయినా ఒదిగి పోయే సత్తా ఉన్న ఎన్టీఆర్‌తో ఈ సినిమాలో అద్బుతమైన పాత్రను త్రివిక్రమ్ వేయిస్తున్నాడు అంటూ సమాచారం అందుతుంది.
హీరోయిన్ చుట్టు తిరిగే కథలు తెలుగులో ఎన్నో వచ్చాయి.అయినా ఇది ప్రత్యేకంగా ఉంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన ఒక్క రోజులోనే సినిమాలో హీరోయిన్ లుక్‌ను కూడా రివీల్ చేశారు అంటే, సినిమాలో హీరోయిన్ ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఫస్ట్‌ుక్‌తో పాటు ఎన్టీఆర్, పూజా హెగ్డేలతో మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెల్సిందే.