కులం కంపు కొడుతున్న జనసేన !

నాకు కులం, మతం, కుటుంబమనే భావనలేదు.ప్రజలే నా కులం …సమాజ శ్రేయస్సే నాకు ముఖ్యం.

 Pawan Kalyan Cast Politics-TeluguStop.com

కులపిచ్చి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం.ఈ మాటలు అన్నది ఎవరో కాదు జనసేన అధ్యక్షుడు పాన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలు ఇవి.అయితే పవన్ మాటలు విని నిజంగానే పవన్ కి కుల ఫీలింగ్ లేదా అని అందరూ మెచ్చుకున్నారు.కానీ వాస్తవంగా ఆయన చుట్టూ ఉన్నవారు.

ఆయన చేరదీస్తున్నవారిని చూస్తే పవన్ మాటల్లో నిజంలేదని అర్ధం అవుతోంది.జనసేన చుట్టూ రోజురోజుకి కాపు నేతలు చేరిపోతున్నారు.

క్రమక్రమంగా ఆ పార్టీకి కుల రంగు ఫెవికాల్ లా అంటుకుపోతోంది.ఇలాగే కాపు నాయకులూ పవన్ చుట్టూ చేరితే జనసేన మరో ప్రజారాజ్యం అవ్వక తప్పదు.

పవన్ చుట్టూ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.అంతదాకా ఎందుకు.? ఆయనకు సలహాలు ఇచ్చే వారి దగ్గర నుంచి.ఈ మధ్యనే తన రాజకీయ వ్యూహకర్త అంటూ పరిచయం చేసిన వ్యక్తి నుంచి ఆయన చుట్టూ సలహాదారులుగా వ్యవహరించేవారు.

ఆయనకు కొన్ని సూచనలు ఇచ్చేందుకు నియమించుకున్న వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే.కులం మీద పవన్ అదే పనిగా చెప్పే మాటలకు.చేతలకు మధ్య అస్సలు పొంతన కనిపించడంలేదు.

ఇటీవల జనసేనలో చేరిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ కు వెంటనే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందించారు పవన్.ఇతను కాపు సామజిక వర్గానికి చెందినవాడు.తోట చంద్రశేఖర్ తో పవన్ కు గడిచిన పదేళ్లుగా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని పవన్ ప్రకటించాడు.

అలాగే పశ్చిమగోదావరి జిల్లా నుంచి పార్టీలో చేరబోతున్న మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కూడా ఇదే సామజిక వర్గం.అలాగే పవన్ చుట్టూ ఉన్న కోటరీలో అత్యధికులు కాపు సామాజికవర్గం వారే.

వాస్తవానికి వారి వాళ్ళ పవన్ కి రాజకీయంగా పెద్ద ఉపయోగం లేకపోయినా వారికి భారీ జ్జీతలు ఇచ్చి మరీ పోషిస్తున్నాడు పవన్.

కాపు సామజిక వర్గం నాయకులను పవన్ కావాలని చేరదీస్తున్నాడా లేక సాధారణంగానే వారు పవన్ పంచన చేరుతున్నారా అనే విషయం పక్కనపెడితే సామాన్య ప్రజల్లో జనసేన అంటే కాపు పార్టీ అనే ఫీలింగ్ కనుక వస్తే జనసేన భవిష్యత్తు గందరగోళంలో పడడం ఖాయం.

ముఖ్యంగా అన్ని పార్టీలకు కీలకమైన గోదావరి జిల్లాల్లో గట్టి దెబ్బే.ఎందుకంటే ఇక్కడ ప్రధాన సామాజికవర్గాలుగా బీసీలు – కాపులు ఉన్నారు.

ఈ సామాజికవర్గాలవారు ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉంటారు.ఇవన్నీ బేరీజు వేసుకుని పవన్ వ్యవహరిస్తే మంచిది లేదంటే.?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube