రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు.ఏపీలో ఇప్పటి పరిణామాలు చుస్తే ఈ విషయం మరోసారి ఋజువు అవుతోంది అనే చెప్పాలి.
అమరావతి శంకుస్థాపనకి వచ్చి కుండడు మట్టి తీసుకువచ్చిన మోడీ.ఇప్పుడు అదే మట్టితో ఏపీలో టిడిపిని పోలవరం రూపంలో కప్పెయాలని భావిస్తున్నారు.
మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న టిడిపికి సంకటంగా మారాయి.పోలవరంపై కేంద్రం మొదటినుంచీ ఏదో ఒక కొర్రీ పెడుతూనే ఉంది.
తాజాగా పోలవరం ప్రాజెక్ట్‌ని ఆపాలంటూ అల్టిమేటమ్ ఇచ్చేసింది.ఓ వైపు, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాసిన లేఖతోనే ప్రాజెక్ట్‌ను ఆపాలని ఆదేశాలు వచ్చాయని వినిపిస్తున్నా.
ఎందుకు ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుందో స్పష్టత ఇవ్వడం లేదు
ఇప్పడు పోలవరం ముందుకు సాగితే ఏపీలో టిడిపి హవాని తట్టుకుని నిలబడగలిగే సత్తా ఏ పార్టీకి లేదు అనేది వాస్తవం.అందుకే చంద్రబాబు కూడా ఈ విషయంలో ఎంతో సీరియస్ గా వర్క్ చేస్తున్నారు.
కావాలనే టిడిపిని కట్టడి చేయాలని భావించిన కేంద్రం ఇప్పుడు ప్రాజెక్ట్ ఆపాలి అని చెప్పడమే ఇందుకు నిదర్సనం అని అంటున్నారు విశ్లేషకులు
అయితే చంద్రబాబు అంటే ఆషామాషీ కాదు.ఒక్క సరి వ్యూహరచన చేస్తే తన టార్గెట్ ఎక్కడా మిస్ అవ్వకుండా దూసుకు పోతుంది కూడా ఇప్పడు బాబు బిజెపిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.
అందులో భాగంగా బీజేపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి.టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.
తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ విషయంలో టీడీపీ అధినేత చాలావరకు విజయం సాధించారనే ప్రచారం జరుగుతోంది.నిజానికి పోలవరం ప్రాజెక్టు అనేది పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులతోనే నిర్మించాల్సిన ప్రాజెక్టు.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని విభజన చట్టంలో కూడా ఉంది
కానీ విభజన చట్టంలోని అనేక హామీలను గాలికి వదిలేసిన మోదీ ప్రభుత్వం…పోలవరం విషయంలో కూడా హామీలని పక్కన పడేసింది.అయితే మిగతా హామీలను కేంద్రం నెరవేర్చకపోయినా… చూసీచూడనట్టుగా వ్యవహరించిన చంద్రబాబు… పోలవరం విషయంలో మాత్రం వెనక్కితగ్గేది లేదు అంటున్నారు…పోలవరం పూర్ర్తయ్యేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ అసలు ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత తొందరగా ఎలా పూర్తి చేయగలమనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే ఆయన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.బాబు ఈ నిర్ణయంతో బిజెపి కి మూడినట్టే అంటున్నారు.
ఎలా అంటే ఏపీ అండర్ లోకి ప్రాజెక్ట్ ని తీసుకోవడం అంటే కేంద్రం పట్టించుకోవడం లేదు అనే అర్థం వస్తంది .అప్పుడు ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లి ప్రజల ముందు బిజేపిని దోషిగా నిలబెట్టాలి అనేది బాబు ప్లాన్ ఒక వేళ ఇదే కనుకా జరిగితే బాబు మీద సానుభూతి.బిజెపి మీద వ్యతిరేకత వస్తుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు
వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా కేంద్రం ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదనే సంకేతాలను పంపించారు.తాజాగా ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం మరోసారి కొర్రీలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో… కేంద్రంలోని అధికార బీజేపీని చంద్రబాబు ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టినట్టే అని కొందరు చర్చించుకుంటున్నారు.