ప్రేమ పొంగాలి అంటే పెదవులకు ఇవ్వాలి లంచం.పెళ్లి అవ్వాలి అంటే పెద్దలకు కట్టాలి లంచం.
పుట్టుక కేమో గ్రహాలకు లంచం.కష్టం వస్తె శాంతులతో లంచం.
కోరికలు తీరడానికి దేవుళ్ళకు లంచం.కొరివి పెట్టడానికి కొడుకులకు లంచం .లంచం లేకపోతే మంచంలో కాలు దిగదు.లంచం లేక పోతే కంచం లో ముద్ధ దిగదు.
లంచం అల్లుకు పోయింది దేహానికి కవచంలా.లంచం అనేది సమస్త ప్రపంచానికి పట్టింది పిశాచం లా.అన్నారు పూర్వం గొప్ప మహాను భావులు.చేప నీళ్లు తాగడము,ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోవడం చూడలేముఅన్నారు పూర్వ కాలము లో చాణుక్యుడు.
అవినీతి అవినీతిని ప్రసవించుతుంది.శిక్ష మినహాహింపు సంస్కృతి ని పెంచుతుంది” అవినీతి ,అవినీతి, లంచం.
చేతులు తడపందే ప్రభుత్వ కార్యాలయాల్లో పని అయ్యే పరిస్థితులు లేవు.అణువు అణువు నా అవినీతి విశ్వవ్యాప్తం అయినది.
అవినీతి,అధికారం నాణానికి రెండు ముఖాలుగా మారిపోయినాయి.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 న అంతర్జాతియ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరపాలని యు.న్.ఓ సూచించింది.యూరప్ లోని కొన్ని దేశాల్లో అవినీతి తక్కువ స్తాయిలో వుండగా,ఆఫ్రికన్ దేశాలలో అవినీతి తారాస్తాయికి చేరినధి.అవినీతి ని అంతం చేయాల్సిన చర్యల మీద యు.యన్.ఓ చారిత్రక పత్రమును డిసెంబరు 9 న రూపొందించడం జరిగింది.మన దేశంలో ఎయిడ్స్ మహమ్మారి కన్నా అవినీతి మహమ్మారి వేగంగా విస్తరించింది.దక్షిణ ఆసియా దేశాలలో నే కాక యావత్ దేశాలలోను అవినీతి బాగ ప్రబలిన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది.
ట్రాన్స్ పరెన్సి ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల లో పనుల నిమిత్తం 75 శాతం ప్రజానీకం లంచాలు చెల్లించుకొవాల్సిన అవసరం ఏర్పడుతుందనీ తెలుస్తుంది.ఇటీవల విడుదల చేసిన సర్వే ప్రకారం.
మన దేశం అవినీతిలో 87 వ స్థానంలో వుంది.లంచం ఇవ్వడం,తీసుకోవడం కూడా చట్ట రీత్యా నేరమే.
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి కి పాల్పడి నపుడు ప్రజాదనమును అపహరించినపుడు ఉద్యోగం నుండి తొలగించడం సరి అయిన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయ స్థానం కూడా పేర్కొంది.

ప్రపంచంలో ని 176 దేశముల అవినీతి తో పోలిస్తే భారత్ రేటింగ్ 87 వ స్థానం లో వుంది.గత సంవత్సరం మన స్థాయి 90.పక్కన గల శ్రీలంక దేశ అవినీతి 79 వ స్థానం,రష్య 80 వ స్థానం,డెన్మార్క్ అధికముగ 94 వ స్థానం లో వుంది.అఫ్ఘానిస్తాన్, ఇరాన్,నేపాల్,పాకిస్థాన్,బంగ్లాదేశ్ దేశములు భారత్ కన్న ఎక్కువ స్థాయిలలో వున్నాయి.మన దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది.టెండర్ల లో గోల్ మాల్ వల్ల అవినీతి అధికంగా జరుగుతుంది అని తెలుస్తుంది.కొంత మంది కాంట్రాక్టరులు ఇష్టారాజ్యం గా వ్యవహరించడం జరుగుతుందని,చేపట్టిన పనుల లో నాణ్యత లోపించడం,పాలకులు,అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అప్పగించడం సాధారణంగా మారిపోయింది.
రోడ్లు,,ఆనకట్టలు,భవనాలు త్వరగా పాడై పోవడం,అలాగే రవాణా రంగం,ఆదాయపు పన్ను శాఖ,రెవెన్యూ,సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయము,పోలీస్,గనులలో , అవినీతి తార స్థాయికి చేరింది అని సర్వేలు చెబుతున్నాయి.అభివృద్ది అవినీతిని కబలిస్థుంధి.
ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేసి అవినీతి చేపల్ని వల వేసి పట్టుకుంటున్న్న అధికారులలో మార్పు రావడం లేదు.

గతం లో కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.మన రాష్ట్రం లో కూడా ప్రభుత్వ కార్యాలయాల లో అవినీతి తార స్థాయికి చేరింది.ప్రతీ రోజు ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయము లో అవినీతి అధికారులు,సిబ్బంది అవినీతి నిరోధకశాఖ కి పట్టు పడటం సర్వ సాధారణ మయింది.
సిగ్గు లేకుండా లంచాలు అడుగుతూ వారి వారి వృత్తులకు కళంకం తెస్తూ వున్నారు.తాజాగా జనగాం జిల్లా నర్మెట్ట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు పి.జీ.టి టీచర్ అదే పాటశాల లో స్వీపర్ గా పని చేస్తున్న రేణుక నుండి రూ.పద్దెనిమిది వేలు లంచం తీసుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులకి పట్టుబడినారు.చివరకు పవిత్రమయిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు కూడా లంచాలకు మరగడం ఈ వృత్తి నీ కలవరానికి గురిచేస్తోంది.
ఇటీవల కాలంలో మున్సిపల్ కార్యాలయ ల్లో అవినీతి హెచ్చు స్థాయిలో పెరుగుతూ వుంది.ప్రతీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖకి పట్టు బడుతూ వున్నారు.

రాష్ట్రం లో జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ,యూత్ ఫర్ ఆంటీ కరప్షన్,సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక,లోక్ సత్తా లాంటివి అవినీతి కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాయి.అవినీతి నిరోధక శాఖ వారు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందు వున్నారు.వారం పాటు అవినీతి వ్యతిరేక వారం నిర్వహించి విద్యార్థులకు అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వున్నారు.ర్యాలీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేస్తూ వున్నారు.ప్రజలలో ప్రశ్నించే హక్కు,అధికారులలో జవాబుదారీ తనం పెరిగినప్పుడే అవినీతి తగ్గుతుంది.లంచం ఇవ్వడం,తీసుకోవడం నేరమే అనే భావన అందరిలో కలగాలి.
అవినీతి లేని సమాజం ని నిర్మించడం మన హక్కు.అవినీతి అంతం మన పంతం కావాలి.
అవినీతి అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలి.ప్రతి గ్రామ,గ్రామాన ,పట్టణాలలో,నగరాలలో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నంబరులను గోడ లమీద రాయించాలి.
టోల్ ఫ్రీ నంబరు 1064 గురించి విస్తృతం గా ప్రచారం చేయాలి.అవినీతి నిర్మూలనకు సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలి.







