అధికార పార్టీలో ఎమ్మెల్యేల దూకుడు రెండు విధాల ప్రయోజనం లేకుండా పోవడంతో పాటు.పార్టీ పరువు ను సీఎం జగన్ కలేజాను కూడా ఇరకాటంలోకి నెడుతోందని అంటున్నారు పార్టీ సీనియర్లు.
స్థానిక ఎన్నికలు ఇటు ప్రభుత్వానికి, అటు నాయకులకు కూడా ఇంపార్టెంటే.అంతేకాదు ఎవరికి వారు తమ వారిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో దూకుడు పెంచడం, ఫోన్లలోనే బెదిరింపులకు పాల్పడడం వంటి పరిస్థితి పార్టీ పరువును బజారున పడేస్తున్నాయని అంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల దూకుడు ఓ రేంజ్‌లో కొనసాగుతోంది.యలమంచిలి ఎమ్మెల్యే కన్న బాబు రాజు వ్యాఖ్యలు తీవ్ర వివాదం సృష్టించాయి.ఇక, పైకి వెలుగు చూడకపోయినా చాలా నియోజకవ ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే దూకుడు ఎక్కువగా ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఇక, నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ సమక్షంలోనే నాయకులు తోపులకు, పిడిగుద్దులకు కూడా రెడీ కావడం, మంత్రి వారిని వారించడం తెలిసిందే.ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఎదురు దాడి కారణంగా.
పార్టీ పరువుపోతోందని అంటున్నారు పరిశీలకులు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ సమన్వయకర్త సిద్ధార్థరెడ్డి మధ్య ఆధిపత్య పోరు పంచాయతీ ఎన్నికలపై కూడా పడింది.
ఏకంగా వీరు మంత్రుల సమక్షంలోనే ఘర్షణకు దిగడంతో అసలు పార్టీలో ఏం జరు గుతోందనే విషయం గందరగోళానికి దారితీసింది.అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీకి కొన్ని నియోజకవ ర్గాల్లో నేటికీ స్పష్టత రాలేదు.
పలు నియోజకవర్గాల్లో నాయకులు రెండుమూడు వర్గాలుగా చీలిపోయారు.
కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు పలుమార్లు తారస్థాయికి చేరాయి.
ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఉందని తెలుస్తోంది.దీంతో పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని.
అటు జగన్ పరువు పోయేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.