అమెరికాలోని లూసియానాకు చెందిన ఓ కుక్క తాజాగా వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది.అందుకోసం ఇది కష్టపడింది ఏమీ లేదు.
కానీ దీని నాలుక అత్యంత పొడగ్గా ఉండటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని గుర్తించింది.అంతేకాదు, ఈ కుక్కకు ‘లాంగెస్ట్ టంగ్ ఆన్ ఏ డాగ్( Longest tongue on a dog )’ అనే ఒక అవార్డు కూడా ప్రధానం చేసింది.
ఈ కుక్క పేరు జోయీ ( Zoey ).ఇది లాబ్రడార్, జర్మన్ షెపర్డ్‌ల నుంచి పుట్టిన ఒక మిక్స్డ్ బ్రీడ్.ఈ కుక్క నాలుక 12.7 సెంటీమీటర్ల పొడవుతో చాలా పెద్దగా ఉంది.ఇది ఇతర లివింగ్ డాగ్స్ కంటే పొడవుగా ఉంటుంది.9.7 సెంటీమీటర్ల పొడవున్న నాలుకతో బిస్బీ అనే కుక్క గతంలో క్రియేట్ చేసిన రికార్డును తాజాగా జోయీ బ్రేక్ చేసింది.
జోయీ యజమానులు అయిన సాడీ, డ్రూ విలియమ్స్( Drew Williams ) ఈ కుక్కను చిన్నతనం నుంచి పెంచుతున్నారు.కుక్కపిల్లగా ఉన్నప్పటికీ, జోయీ నాలుక తన నోటి నుంచి చాలా బయటకు వచ్చేదట.అది పెద్దయ్యాక నాలుక మరింత బయటికి వచ్చిందని యజమానులు తెలిపారు.
ఆ కుక్క నడి వయసుకు వచ్చిన తర్వాత దాని నాలుక ఇంకా పొడవుగా అయిందని వారు తెలిపారు.సాడీ విలియమ్స్ మాట్లాడుతూ, “మేం జోయీని కేవలం ఆరు వారాల వయస్సులో ఉన్నప్పుడు దత్తత తీసుకున్నాం, దానితో ఫస్ట్ పిక్ తీసుకున్నాం.
అందులో కూడా కుక్క నాలుక పెట్టగానే ఉంది” అని అన్నారు.
సాధారణంగా కుక్కలు తమ ఆయాసాన్ని లేదా వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి నాలుకను బయటకు వెళ్ళబెట్టి రొప్పుతూ ఉంటాయి.అయితే జోయీ కుక్క నాలుక చాలా పెద్దగా ఉండటంతో అది ఈ పని చేయలేకపోతోంది.అంతేకాదు అది చాలా తొందరగా అలసిపోతోంది.
దాంతో డాక్టర్లు ఆ కుక్కను పశు వైద్యుడు వద్దకు కూడా తీసుకెళ్లారు.ఆ డాక్టర్ ఇంత పెద్ద నాలుక ఏ కుక్కకు ఉండదని చెప్పడంతో వారు ఈ కుక్కను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దృష్టికి తీసుకువచ్చారు.
అలా జోయీ తన పొడవాటి నాలుకకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సంపాదించింది.