క్రికెట్ కొన్ని కోట్ల మందికి ఒక విలువైన ఎమోషన్.అందరూ ఒక్కటై చూసే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే.
అదే క్రికెట్ మన టెలివిజన్ నటీనటులు ఆడితే? ఆ ఆటే వేరు కదా? అలాంటి ఆటని మన ముందుకు తీసుకువస్తుంది జీ తెలుగు – ‘జీ తెలుగు వారి పాట’ అనే కార్యక్రమంతో మన అందరిని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు అలరించబోతుంది.
క్రికెట్ అంటే టీమ్స్ ఏంటి ఎవరు ఎలా ఆడతారు అనే కదా ఆలోచిస్తున్నారు? మన క్రికెట్ లీగ్ లో ఎలా అయితే ప్లేయర్స్ ని కొనుక్కుంటారో అలాగే ఇక్కడ మన కెప్టెన్స్ నిరుపమ్ మరియు కల్కి రాజా – సిద్ధార్థ్, విష్ణు ప్రియా, అమరదీప్, సింధూర, వసుధ, సత్య, సిరి, అనూష హెగ్డే, ప్రతాప్, ఆకర్ష్, పూజ, నవ్య, శ్రీ ప్రియా, సునంద, సిద్ధూ ఆర్టిస్ట్స్ ల నడుమ ఎవరు ఎవరని కొనుకుంటారు అని చూడాలి.అందరూ మంచి స్నేహితులు కానీ బరిలోకి దిగితే మాత్రం ఎవరికీ వారే సమవుజ్జీలు.మరి గెలుపు ఎవరిది?
అలాగే శ్రీముఖి ఈ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించింది.ఈ క్రికెట్ కి కామెంటరీ ఇచ్చేందుకు మనందరికీ ఎంతో ఇష్టమైన సదం మరియు శ్రీముఖి సిద్ధమయ్యారు.ఈ ఆదివారం అందరిని అలరింపచేయడానికి స రి గ మ ప – ది నెక్స్ట్ సింగింగ్ విన్నర్ మరియు రన్నర్-అప్ యశస్వి, భరత్ వారి పాటలతో మంత్రముగ్ధుల్ని చేయగా సింగర్ కోమలి మరియు వారితో పాటు ఎన్నో అద్భుతమైన డాన్స్ పెరఫార్మన్సెస్ తోటి అందరిని ఉత్తేజపరుచనున్నారు మన నటీనటులు.
ఇంతేనా అనుకోకండి, సదం- రియాజ్ మరియు పండు తన కామెడీ స్కిట్స్ తోటి అటు ప్రేక్షకులను ఇటు సెలెబ్రిటీలని కూడా కడుపుబ్బా నవ్వించబోతున్నారు.
మరి ఇంకా ఎందుకు ఆలస్యం, తప్పకుండా వీక్షించండి ‘జీ తెలుగు వారి పాట ‘ ఈ ఆదివారం – సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో.
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.
నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ తెలుగు గురించి
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.
విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.
ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.