ఎంటర్టైన్మెంట్, ఫన్, డ్రామా మరియు అంతకు మించిన వినోదాన్ని ఈ ఆదివారం అందించడానికి వస్తుంది జీ తెలుగు

ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఇంట్లోనే ఉంటూ ఎంటర్టైన్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఇలాంటి సమయంలో అందరినీ అలరించడానికి జీ తెలుగు ఈ ఆదివారం అంటే ఈ జూన్ 20న, రంగ్ దే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో పాటు ‘సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3 ‘ మెగా లాంచ్ ఎపిసోడ్ తో మన ముందుకు రెండింతల వినోదంతో వస్తుంది.

 Zee-telugu-is-here-this-sunday-to-provide-entertainment-fun-drama-and-more, Zeet-TeluguStop.com

నితిన్ మరియు కీర్తి సురేష్ నటించిన రంగ్ దే సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జూన్ 20 సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం చేయనుంది.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించంగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

అర్జున్ (నితిన్), అను (కీర్తీ సురేష్) చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు.అను చదువులో టాపర్, అర్జున్ వీక్.ప్రతి విషయంలోనూ అర్జున్‌ని అనుతో పోల్చి పదే పదే తిడుతూ ఉంటాడు అర్జున్ తండ్రి (నరేష్).దీంతో అనుపై కోపం, ద్వేషం పెంచుకుంటాడు అర్జున్.

అయితేra అను మాత్రం అర్జున్‌పై ఇష్టాన్ని పెంచుకుంటుంది.అను తల్లి (రోహిణి) పెళ్లి చేసుకోవాలని అనుని బలవంతం చేయడంతో అర్జున్‌ అభిప్రాయం తెలుసుకుంటుంది.

అర్జున్ కూడా పెళ్లి చేసుకోమని చెప్పడంతో, తన మనసులో ప్రేమను దాచుకుని పెళ్లికి సిద్ధపడుతుంది.కానీ,అను అర్జున్ ను బోల్తా కొట్టించి చివరి క్షణంలో అర్జున్‌తో తాళి కట్టించుకుని భార్య అవుతుంది.

తాను ఎందుకు అలా చేసింది? ఎందుకు వారిద్దరూ విడాకులు తీసుకుందాం అనుకుంటారు.

హీరో నితిన్ మాట్లాడుతూ, ” రంగ్ దే టీం తో పని చేసి నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

ఈ చిత్రం ద్వారా కీర్తి సురేష్, దర్శకులు అట్లూరి తదితర తారాగణంతో నాకు మంచి స్నేహం ఏర్పడింది.మాతో పనిచేసినందుకు పిసి శ్రీరామ్ గారికి శతకోటి ధన్యవాదములు.

అలాగే దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ని అందించారు.కుటుంబం అంతా కలిసి చూసే చిత్రం ఇది.ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో తప్పకుండా మీ ఫామిలీ తో కలిసి చూసి ఆనందించండి.

అప్పుడే అయిపోయింది ఏంటి ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారా? లేదు ఇంకా ఉంది.తెలుగు రాష్ట్రాల అభిమాన ప్రేక్షకులకు ‘సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3′ జీ తెలుగు అందిచబోతున్న వినోదాల విందు జూన్ 20 న రాత్రి 8 గంటలకు మెగా లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభం కానుంది.అన్ని సీరియల్స్ నడుమ సాగే రసవత్తరమైన పోరుతో గతంలో రెండు సీజన్స్ తో ఈ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటున్న రామ సక్కని సీత, ఊహలు గుసగుసలాడే, గుండమ్మ కథ, ఇంటి గుట్టు, మిఠాయి కొట్టు చిట్టెమ్మ, వైదేహి పరిణయం, హిట్లర్ గారి పెళ్ళాం, కృష్ణ తులసి, రాధమ్మ కూతురు, నాగ భైరవి, నెంబర్ 1 కోడలు, త్రినయని, ప్రేమ ఎంత మధురం, కళ్యాణ వైభోగం మరియు సూర్యకాంతం ధారావాహికల కుటుంబాలు మూడో సీజన్ ‘సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్టైటిల్ పోరు కోసం బరిలో దిగనున్నాయి. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యహరించగా ఈ సీజన్ లో నాలుగు రౌండ్స్ ఉంటాయి.

జీ తెలుగు కుటుంబం యావత్తు అంత ఒకటే చోట చూసే అవకాశం మిస్ కావద్దు అనుకుంటే 27 జూన్ నుండి రాత్రి 9 గంటలకు తప్పకుండా సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ చూడాల్సిందే.

Telugu Mudhiraj, Nagabharavi, Pradeep, Ranghe, Sanday, Seson, Serials, Zee-Movie

ఈ ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 10:00 గంటలవరకు తప్పక మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డీ వీక్షించండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube