జీ కుటుంబం అవార్డ్స్‌-2021కు నామినేషన్స్‌ ప్రకటించిన జీ తెలుగు

మమతానురాగాల సంగమం కుటుంబం.కుటుంబం అంటే ‘అన్న గారి కుటుంబం’ అనే పాట ఎలా మన అందరి మనసులో మెదులుతుందో అదే విధంగా జీ తెలుగు వారి కుటుంబం కూడా మన మదిలో నిలిచిపోయింది.

 Zee Telugu Announces Nominations For Zee Family Awards-2021 , Zee Telugu ,zee Fa-TeluguStop.com

జీ తెలుగులో ప్రసారం చేస్తున్న సీరియల్స్‌ ద్వారా, ఆ సీరియల్స్‌లోని నటీనటులు మన ఇంట్లో సభ్యులుగా మారారు.ఇప్పుడు జీ కుటుంబం అవార్డుల కార్యక్రమాన్ని 11వ సారి దిగ్విజయంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది మన ఛానల్.

అద్భుతమైన కథలతో, ఆకట్టుకునే మలుపులతో ఎన్నో సీరియల్స్‌ని అందిస్తున్న మన జీ తెలుగు సాధారణ ప్రజల కష్టసుఖాలను ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని, వాటిని ఆకట్టుకునే రీతిలో అందిస్తూ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.కష్ట మొచ్చినా కరగనిది, నష్ట మోచ్చినా చెరగనిది బంధాలతో నిండిన బంగారు కుటుంబం – జీ తెలుగు వారి కుటుంబం.

ఆ అనుబంధాల్ని ఒక వేడుకలా చేసుకోవడమే ఈ అవార్డుల పండుగ.ఈ అవార్డుల కార్యక్రమంలో పాపులర్‌ వ్యూయర్స్‌ ఛాయిస్ నుంచి స్పెషల్‌ జ్యూరీ అవార్డుల వరకు ఎన్నో కేటగిరీలు ఉన్నాయి.

ఇక జీ కుటుంబం అవార్డుల విషయానికి వస్తే, ఇందులో విజేతల్ని ఓటింగ్‌ ప్రాసెస్‌ ద్వారా ఎన్నుకుంటారు.అభిమానులు, ప్రేక్షకులు తమకు నచ్చిన స్టార్స్‌కి ఓటు వేయవచ్చు.57575 నెంబర్ కు ఎస్ ఎం ఎస్ చేసి మీరు వోట్ వేయొచ్చు లేదా జీ తెలుగు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయొచ్చు, ఇవేకాకుండా జీ 5 యాప్‌/వెబ్‌సైట్‌కి లాగిన్‌ అయ్యి జీ కుటుంబం అవార్డ్స్‌ పోర్టల్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు.ఈ వోటింగ్ ప్రాసెస్ సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది.

అతి త్వరలోనే జీ కుటుంబం అవార్డ్స్ మన హైదరాబాద్ లోనే జరగనున్నది.మీకు నచ్చిన తారలకు వోట్ వేయడం మిస్ అవ్వకండి.

జీ 5 అప్ లేదా 57575 నెంబర్ కు ఎస్ ఎం ఎస్ చేయండి మరియు జీ తెలుగు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయడం మరిచిపోకండి.తక్షణమే వోట్ వేయండి.

ఇంకా ఎందుకు ఆలస్యం.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube