ఏపీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) పై టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన రా కదలి రా సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పై ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ అర్జునుడు కాదని, అక్రమార్జునుడని పేర్కొన్నారు.ఏపీని సర్వనాశనం చేశారని ఆరోపించారు.వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు తిరిగి కోలుకోలేనంత నష్టపోయారని చెప్పారు.ఇచ్చేది రూ.100 దోచుకునేది రూ.వేలల్లో ఉందని విమర్శించారు.