సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలలో వెంకటేష్( Venkatesh ) ఒకరు.ఈయన ఒకప్పుడు చేసిన చంటి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇక ప్రస్తుతం ఈ చంటి సినిమాని ఇప్పుడున్న ఒక యంగ్ హీరో తో రీమేక్ చేయాలని చూస్తున్నారు.
నిజానికి చంటి సినిమా( Chanti Movie ) అప్పట్లో వచ్చే ఒక క్లాసికల్ మూవీ గా మిగిలిపోయింది.ఇలాంటి సినిమాని మళ్లీ రీమేక్ చేయడం అవసరమా అని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే చంటి సినిమాలో వెంకటేష్ పోషించిన పాత్ర ఆయన నటించిన నటన అద్భుతంగా ఉంటుంది.
ఇక ఆ సినిమా కి ఆయన నటనే చాలా వరకు ప్లస్ అయింది.అయితే ఈ సినిమాని కొన్ని మార్పులు చేర్పులతో ప్రస్తుతం యంగ్ జనరేషన్( Young Generation ) లో ఉన్న ఒక స్టార్ హీరోతో మళ్లీ రీమేక్ చేయాలని కొంత మంది పెద్ద దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారు.ఇక ఈ క్రమంలో నిజంగానే ఈ సినిమాని రీమేక్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ రీమేక్ చేస్తే మాత్రం వెంకటేష్ యాక్టింగ్ ని మైమరిపించేలా చేసే నటుడు ఈ సినిమాకి అవసరం… లేకపోతే మాత్రం ఈ సినిమా దర్శక నిర్మాతలకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఒక క్యారెక్టర్ ని సెట్ చేసి పెట్టిన తర్వాత దాన్ని రీమేక్( Chanti Movie Remake ) చేయాలి అంటే మాత్రం ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించే నటుడు కావాలి.ఏ మాత్రం చిన్న తేడా కొట్టిన కూడా మొత్తం సినిమాకే దెబ్బ పడుతుంది.ఇక ఇలాంటి సినిమాలను మళ్లీ తీయాలని చూస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది… అయితే ఈ సినిమాలో చేసే హీరో ఎవరు అనేది ఇప్పటివరకు అఫీషియల్ గా బయటికి రానప్పటికీ కొంతమంది దర్శక నిర్మాతలు మాత్రం ఈ సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నారు…
.