టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాల గురించి చెప్పుకోదగ్గ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి “సాహో” చిత్రం ఒకటి.ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించాడు.
మొదటగా సుజిత్ శర్వానంద్ తో 2014వ సంవత్సరంలో రన్ రాజా రన్ అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు.అయితే రన్ రాజా రన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
దీంతో సుజిత్ తన రెండో సినిమానే ప్రభాస్ తో తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.అంతేగాక ఇప్పటివరకు ఏ యువ డైరెక్టర్ చేయనటువంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద సాహసమే చేశాడు.
అయితే సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ వసూళ్లను మాత్రం ఓ రేంజ్ లో రాబట్టింది.అంతేగాక దర్శకుడు సుజిత్ సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.
అయితే ఈ కుర్ర దర్శకుడు త్వరలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తమిళ చిత్ర రీమేక్ కి కూడా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.అయితే ఆ చిత్రం ఏంటంటే తమిళ్ లో మంచి విజయం సాధించినటువంటి లూసిఫర్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా ఉన్నాడట.
దీంతో ఇప్పటికే చిరంజీవి టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులను లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయమని చెప్పగా కొందరు నో చెప్పినట్లు తెలుస్తోంది.ఎందుకంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగేటువంటి ఈ కథనం తేడా కొట్టిందంటే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుందనే భయంతో పలువురు దర్శకులు నో చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఈ లూసీఫర్ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సుజిత్ ముందుకు వచ్చినట్లు సమాచారం.దీంతో చిరంజీవి కూడా కుర్ర హీరో కి ఛాన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడట.ఈ వివరాలను తొందర్లోనే అధికారికంగా వెలువరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న అటువంటి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ చిత్రాన్ని ఈ దసరా కానుకగా విడుదల చేసేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.