పసిఫిక్ మహాసముద్రం గురించి మనం స్కూలులోనే చదువుకున్నాం.మహాసముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం అన్నిటికన్నా పెద్దది అన్న సంగతి తెలిసిందే.చరిత్ర చూస్తే, మన పూర్వికులు ముఖ్యంగా ఆసియా, ఓషియానియా ప్రజలు పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణించే జాడలు అనేకం వున్నాయి.1521వ సంవత్సరంలో స్పానిష్ నావికులు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సమయంలో బృందంలోని పోర్చుగీసు అన్వేషకుడు ‘ఫెర్డినాండ్ మాగెల్లాన్’ అనే అతగాడు ఈ మహాసముద్రానికి ‘పసిఫిక్ మహా సముద్రం‘ అని పేరుపెట్టినట్టు ప్రతీతి.ఆయన సముద్రం చేరుకోవడానికి అనుకూలమైన గాలులను ఎదుర్కొన్నందున ఈ మహాసముద్రానికి ఆయన “మార్ పాసిఫికో ” అనే పేరు పెట్టాడు.
అయితే, తాజాగా ఈ ఫసిఫిక్ మహా సముద్రంలో ఓ అద్భుత ఆనవాళ్లు సైంటిస్టులు గుర్తించారు.
సముద్ర గర్భంలో పసుపు రంగు ఇటుకలతో నిర్మించిన ఓ రోడ్డు ఆనవాళ్లుని కనుగొనడం జరిగింది.హవాయ్ దీవులకు ఉత్తరాన సముద్ర గర్భంలో పరిశోధిస్తుండగా ఈ రోడ్డు కనబడటం గమనార్హం.
సీమౌంట్ ట్రయల్ లో ఉన్న పగులును పరిశీలించేందుకు సైంటిస్టులు సముద్ర గర్భంలోకి వెళ్లగా అక్కడ పసుపు రంగు ఇటుకలతో నిర్మించిన ఓ దారి ఉండటాన్ని చూసి ఒకింత ఆశ్చర్యపోయారు.కాగా, ఈ నిర్మాణం శంకుస్థాపన చేసిన రహదారిని పోలి ఉండటం కొసమెరుపు.
రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే మరో వాహనాన్ని ఉపయోగించి ఈ పసుపు ఇటుకలను పరిశీలించారు.దీంతో వాళ్లకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది.
అదేమిటంటే, ఈ రోడ్డు ఉన్న ప్రదేశంలో ఓ పురాతన సరస్సు ఉండేదట.అయితే అది కాలక్రమేణా ఎండిపోయిందని తెలుసుకున్నారు.
సరస్సు ఎండిపోయిన క్రమంలో ఈ పసుపు రంగు రాళ్ల రోడ్డు ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు.ప్రాచీనకాలంలో భూమిలో జరిగిన అగ్నిపర్వతాల పేలుళ్లవలన ఈ పసుపు రంగు రాళ్లు ఏర్పడ్డాయని అంటున్నారు.
అలాగే వేడి, చల్లదనాల వల్ల పసుపు రంగు రాళ్లకు పగుళ్లు వచ్చి వుంటాయని అభిప్రాయపడ్డారు.తాజాగా, దీనికి సంబంధించిన వీడియోని శాస్త్రవేత్తల టీమ్ EVNautilus అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది.
ఆ ఇటుక రాళ్లను చూస్తే… మనిషి తయారుచేసిన వాటిలాగానే కనబడుతున్నాయి.