ట్రంప్ కి అమెరికా వ్యాప్తంగా నిరసనలు ముంచెత్తుతున్నాయి.ఒక వైపు గోడ నిర్మాణం విషయంలో ట్రంప్ పట్టు లక్షలాది ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటే.
ట్రంప్ మాత్రం ఒక మెట్టు దిగి రావడంలేదు.దాంతో ట్రంప్ పై అక్కడి ఫెడరల్ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు.ఇదిలాఉంటే
తాజాగా ట్రంప్ తమపై అనుసరిస్తున్న విధానాలపై , తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికా మహిళలు తీవ్ర అభ్యంత్యరం తెలుపుతున్నారు.అంతేకాకుండా ట్రంప్ తీసుకుంటున్న పొదుపు చర్యలని వ్యతిరేకిస్తూ శనివారం రోజున అమెరికాలో పెద్ద ఎత్తున భారీ ర్యాలి చేపట్టారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు ఇంత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపడం ఇదే ప్రధమం అంటున్నారు పరిశీలకులు.అమెరికా మహిళలు ఏకంగా వైట్ హౌస్ నుంచీ వైట్ హౌస్ ఎదుట 50 వేల మందితో ప్రధాన మార్చ్ నిర్వహించారు.వేలాది మంది మహిళలు ఇలా వచ్చి నిరసనలు తెలపడం , ప్రస్తుతం కొనసాగుతున్న షట్ డౌన్ ట్రంప్ ప్రజా వ్యతిరేక పాలనకి కొలమానాలు అంటున్నారు డెమొక్రాట్స్
.తాజా వార్తలు