టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పొత్తులో భాగంగా ఎవరెన్ని సీట్లు పంచుకుంటారు అనేది ఇంకా క్లారిటీ లేదు.బిజెపి సైతం ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో, అధికారికంగా సీట్ల పంపకాలపై ఇంకా ఏ ప్రకటన వెలువడడం లేదు.
అయితే జనసేనకు 20 నుంచి 25 స్థానాలను టిడిపి కేటాయించబోతోంది అనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది.కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని పవన్ ప్రకటిస్తూ ఉండడం, టిడిపి సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.
టిడిపి నుంచి పవన్( Pawan ) ఎన్ని సీట్లను ఆశిస్తున్నారు అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.జనసేన నాయకులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టిడిపికి కాస్త ఇబ్బందికరంగానే మారాయి.

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాలలో గెలుస్తామని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చెప్పడంతో, అన్ని స్థానాలను పొత్తులో భాగంగా పవన్ ఆశిస్తున్నారనే విషయం అర్థమవుతోంది.రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీతో పోత్తు పెట్టుకున్నామని పవన్ వ్యాఖ్యానించడం పైన టిడిపిలో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది ? టిడిపి తో కలిసి పోటీ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే విషయాలపై పవన్ కళ్యాణ్ సర్వేను చేయించారు .ఆ సర్వే నివేదిక ఆధారంగానే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే విషయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.గతంతో పోలిస్తే జనసేన బలంగా ఉందని, తాము కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుదలతో పవన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

టిడిపికి ఈ సీట్లో విషయంలో సంకేతాలు ఇచ్చేందుకే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు గా అర్ధం అవుతోంది.అయితే ఇప్పటికే జనసేనకు కేటాయించబోయే నియోజకవర్గాల విషయంలో టిడిపి సీనియర్ నేతలు నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.దీనిపై వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కొంతమంది కీలక నేతలు పార్టీ మారే ఆలోచనకు వచ్చారు.అయితే చంద్రబాబు మాత్రం సీట్ల పంపకాల విషయం బిజెపితో పొత్తు పై క్లారిటీ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.