Rajendra Prasad : రాజేందర్ ప్రసాద్ కి ఒకేసారి 14 మూవీ ఆఫర్స్ అందించిన హీరో.. ఎవరంటే..?

ఫుల్ లెన్త్ కామెడీ సినిమాలతో కూడా హిట్స్ కొట్టొచ్చని నిరూపించిన మొదటి టాలీవుడ్ హీరో రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) అని చెప్పుకోవచ్చు.నటకిరీటిగా అందరి చేత పొగిడించుకుంటాడు ఈ నటుడు.

 Tollywood Hero Who Offered 14 Movies To Rajendra Prasad-TeluguStop.com

నటనలో మద్రాస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్‌ మెడల్‌ కూడా అందుకున్నాడు.యాక్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించినా అతడికి సినిమా అవకాశాలు త్వరగా దొరకలేదు.

దాంతో చేసేదిలేక “మేలుకొలుపు” సినిమా( Melu Kolupu )తో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారాడు.

Telugu Krishna, Melu Kolupu, Rajendra Prasad, Sridevi, Tollywood-Movie

నిజానికి కెరీర్ ప్రారంభించిన సమయంలో రాజేంద్రప్రసాద్ చిన్నగా కనిపించేవాడు.వయసు కాస్త పెద్దదైనా బక్కగా ఉండేవాడు.చైల్డ్ ఆర్టిస్టుగా పెట్టుకుందామన్నా ఆ పాత్రలో అతడు సూట్ అయ్యేవాడు కాదు.

హీరోగా అవకాశం ఇద్దాం అంటే అతడికి అనుభవం లేదు.అందువల్ల కెరీర్ తొలినాళ్లలోనే రాజేందర్ ప్రసాద్ కి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అన్నీ అయిపోవడంతో కొంచెం పాలు, ఒక అరటి పండు తింటూ బతికాడు.డబ్బింగ్ చెప్పుకుంటూ ఎలాగోలా సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని బాగా కోరుకున్నాడు చివరికి రామరాజ్యంలో భీమరాజు( Ramarajyamlo Bheemaraju ) సినిమాలో ఒక ఆర్టిస్టు సడన్‌గా తప్పుకోవడం, అతనికి ఇందులో నటించే అవకాశం రావడం జరిగిపోయాయి.

Telugu Krishna, Melu Kolupu, Rajendra Prasad, Sridevi, Tollywood-Movie

ఈ సినిమాలో శ్రీదేవి కాళ్ళను పట్టుకోవడం ఇష్టం లేక ఆర్టిస్టు తప్పుకున్నాడు.అదే పాత్రను చేయాలని రాజేంద్రప్రసాద్ ను నిర్మాత వెంకన్నబాబు బతిమిలాడారు.దాంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.తర్వాత ఒక సన్నివేశంలో భాగంగా పెళ్లికి సిద్ధమైన శ్రీదేవితో కృష్ణ( Sridevi ) డైలాగులు చెబుతుంటే అతడి పక్కన నిల్చోని రాజేంద్ర ప్రసాద్‌ భయ పడినట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.

ఇవన్నీ గమనించిన సూపర్ స్టార్ కృష్ణ చాలా నవ్వుకున్నాడట.ఈ కుర్రోడు ఎవరో కానీ చాలా బాగా నటిస్తున్నాడు అని ప్రశంసలు కూడా కురిపించాడట.అంతేకాదు ఆయన నటించిన నెక్స్ట్ 14 సినిమాల్లో రాజేంద్రప్రసాద్ కి అవకాశం అందించాడట.ఆ సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయానని రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

స్టార్ కృష్ణకు( Krishna ) తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆయనే లేకపోతే తాను ఇప్పటికీ డబ్బింగ్లు చెప్పుకుంటూ బతికే వాడినని రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.ఇంటర్వ్యూ చూసి చాలా మంది కృష్ణను పొగిడేస్తున్నారు.

కృష్ణ టాలెంట్ ఉన్నవారిని సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తారని ఆయన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం అని మరికొందరు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube