ఏపీలో బలపడాలని ప్రధాన పార్టీగా ఎదగాలని బీజేపీ( BJP ) ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.కానీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడంలేదు.
ఏపీ ప్రజలు వైసీపీ, టీడీపీ, జనసేన( YCP, TDP, Jana Sena ) పార్టీలను మాత్రమే ప్రధాన పార్టీలుగా చూస్తున్నారు తప్పా బీజేపీని అసలు పట్టించుకోవడం లేదు.దాంతో జనసేన పక్షాన చేరి బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికి పెద్దగా ఒరిగిందేమీ లేదు.
బీజేపీని జనసేన మిత్రా పక్షంగానే చూస్తున్నారు తప్పా ప్రధాన పార్టీగా గుర్తించడంలేదు.దీంతో ఏపీలో స్వబలం పెంచుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.
అధికార వైసీపీ పైన, అలాగే ప్రతిపక్ష టీడీపీ పైన ఏపీ కమలనాథులు ఘాటైన విమర్శలు చేస్తున్నప్పటికి, ప్రధాన పార్టీలు బీజేపీని లైట్ గానే తీసుకుంటున్నాయి.

దీంతో పార్టీకి రావలసిన మైలేజ్ రావడం లేదనే చెప్పాలి.ఇదిలా ఉంచితే బీజేపీ అధికారికంగా జనసేనతో పొత్తులో ఉన్నప్పటికి అనధికారికంగా వైసీపీతో కూడా పొత్తులో ఉందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.దీంతో పార్టీపై వినిపిస్తున్న విమర్శలు, పార్టీ బలహీనతలను అధిగమించేందుకు వ్యూహరచన చేస్తున్నారు కమలనాథులు.
తాజాగా కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన కాషాయ పార్టీ.ఈ సమావేశంలో పార్టీ బలహీనతలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం కమలనాథులు మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు సోము వీర్రాజు( Somu Veerraju ) తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమౌతుంది.

రాబోయే రోజుల్లో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ల నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరతారని, బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎడగబోతుందని ఆయన వ్యాఖ్యానించారు.అయితే నిజంగానే బీజేపీలో చేరికలు ఉంటాయా ? ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న బలంతో నేతలను ఆకర్షించే సత్తా ఉందా ? అంటే సమాధానం చెప్పడం కష్టమే.ఎందుకంటే బీజేపీకి ఇతర పార్టీల నేతలను కొనుక్కోవడం కొత్తేమీ కాదు ఆధిపత్యం కోసం ఎంత దూరమైన వెళ్ళేందుకు కాషాయ పార్టీ అధిష్టానం సిద్దంగా ఉంటుంది.
మరి ఆ రకంగా ఆలోచిస్తే ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యే.ఒకవైపు జనసేన అండ ఎలాగూ ఉన్నప్పటికి సొంత బలం పెంచుకోవాలంటే బలమైన నేతలు అవసరం అందుకే నేతలను ఆకర్శించేందుకు కమలనాథులు మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మరి బీజేపీ మైండ్ గేమ్ కు ఇతర పార్టీల నేతలు ఆకర్షితులౌతారో లేదో చూడాలి.