ప్రస్తుతం తెలుగు లో ఉన్న టాప్ హీరోలు ఒక్కొక్కరిది ఒక్కో పంత కొందరు మాస్ సినిమాలు తీస్తుంటే మరికొందరు లవ్ స్టోరీస్ తీస్తూ ఉంటారు ఎవరు ఏ సినిమాలు తీసిన హిట్టు కొట్టడం ఒక్కటే ఇక్కడ అందరి టార్గెట్…అయితే రానా మొదట్లో హీరో గా ఎంట్రీ ఇచ్చినప్పటికి పెద్దగా సక్సెస్ కాలేదు దానితో రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో విలన్ గా చేసి ఇండియా వైజ్ మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక ఆ సినిమా వచ్చినప్పటి నుండి హీరోగా మాత్రమే కాకుండా ఏదైనా ఒక మంచి పాత్ర ఉంటే చాలు దాంట్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ తో పాటు బీమ్లా నాయక్ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందాడు…అలాగే లాస్ట్ ఇయర్ వచ్చిన విరాట పర్వం సినిమాలో కూడా నక్సలైట్ గా నటించి తనదైన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు… ఇక ఆయన సోలో హీరోగా చేసే సినిమాల కంటే డిఫరెంట్ గా ఉండే పాత్రలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది పాత్ర ఏదైనా దాంట్లో తనదైన శైలిలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు…
ప్రస్తుతం రానా కొన్ని సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు ఇక రానా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అనే ఒక నమ్మకానికి జనాలు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుందో అని…ఇలాగే ఇక రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం…