భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi ) వల్ల హీరో విజయ్ కాంత్ కొడుకు పెళ్లి నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తుందట.మరి నరేంద్ర మోడీ కోసం ఎందుకు పెళ్లి వాయిదా వేశారు.
అసలు పెళ్లికి నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు అయిన కోలీవుడ్ హీరో విజయ్ కాంత్ (Vijay Kanth) ఈ మధ్యనే అనారోగ్యం బారినపడి హాస్పిటల్ లో చేరి ఆ తర్వాత కోలుకున్నారు అనుకునే సమయంలోనే కరోనా రావడంతో ఆ మహమ్మారి కారణంగా మరణించారు.
అయితే విజయ్ కాంత్ కి విజయ్ ప్రభాకరన్ షణ్ముఖ్ పాండ్యన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.

వీరిలో పెద్ద కొడుకు విజయ్ ప్రభాకరన్ ( Vijay Prabhakaran ) కి కోయంబత్తూర్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు కీర్తనతో నిశ్చితార్థం జరిగి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది.వీరి నిశ్చితార్థం 2019లో జరిగింది.ఇక ఆ సమయంలో కూడా విజయ్ కాంత్ కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొడుకు ఎంగేజ్మెంట్ కి కూడా రాలేకపోయారు.
ఇక 2020లో పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో విజయ్ కాంత్ నరేంద్ర మోడీని తన కొడుకు పెళ్లికి రావల్సిందిగా కోరాడట.

కానీ 2020లో కరోనా మహమ్మారి రావడంతో మోడీ రాలేకపోయారు.ఇక మోడీ రాలేదని తన కొడుకు పెళ్లి ని వాయిదా వేసుకున్నారు.ఇక ఆ తర్వాత 2022లో మోడీ విజయకాంత్ ( Vijaykanth ) కొడుకు పెళ్లికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ విజయకాంత్ కి ఆరోగ్యం బాగా లేకపోయినందువల్ల అది కుదరలేదు.
ఇలా నాలుగేళ్లుగా విజయ్ ప్రభాకరన్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.దాంతో చాలామంది కోలీవుడ్ జనాలు వీరి పెళ్లి ఆగిపోయింది కావచ్చు అని భావించారు.అయితే ఇంతలోనే విజయ్ కాంత్ మరణించడంతో ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు ఇప్పుడు విజయ్ ప్రభాకరన్ పెళ్లికి నరేంద్ర మోడీ ( Narendra Modi ) వచ్చినప్పటికీ ఇది చూడడానికి విజయ్ కాంత్ బతికి లేరు అని ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.