అమెరికా దేశంలోని హవాయన్ ఐలాండ్లో కొందరికి ఒక వింత కాంతి కనిపించింది.భారీ ఆకారంలో చాలా పెద్దగా ఉన్న ఈ కాంతి వస్తువు బాగా మెరుస్తూ అతివేగంగా వచ్చి ఓ పెద్ద సముద్రం లో పడిపోయింది.
అయితే ఆకాశంలో మెరుస్తూ కిందపడిపోతున్న ఈ కాంతి వస్తువును చూసిన చాలా మంది వీడియోలు తీసి.ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు.
ప్రస్తుతం ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 29వ తేదీన సాయంత్రం 8.30 గంటల సమయంలో ఈ కాంతి వస్తువు కనిపించింది.అయితే పై నుంచి ఏదో కింద పడబోతుందని భయపడిపోయిన కొందరు స్థానికులు 911 కి ఫోన్ చేసి దీని గురించి చెప్పారు.
కానీ ఆ సమయంలో ఎటువంటి ఫ్లైట్లు గాల్లో ఎగరడం లేదని.ఏ విమానానికి కూడా ప్రమాదం జరగలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.
అయితే మోరియా అనే ఒక మహిళ తన భర్త, స్నేహితులతో కలిసి ఆకాశంలో బ్లూ కలర్ లో మెరుస్తున్న ఈ వస్తువును ఫాలో అవుతూ ఏడు కిలోమీటర్ల వరకూ కారులో వెళ్ళారట.7 కిలోమీటర్ల అనంతరం ఆ బ్లూ వస్తువు అమాంతం సముద్రంలోకి పడిపోయిందని ఆ తర్వాత దానికి ఏమయిందో తమకు తెలియలేదని ఆమె చెప్పుకొచ్చారు.టెలిఫోన్ స్తంభం కంటే అతి పెద్ద గా ఉన్న ఈ వస్తువు ఎటువంటి శబ్దం చేయలేదని ఆమె మీడియాతో చెప్పారు.అయితే కొంత సమయానికి మరొక తెలుపు రంగు వస్తువు.
బ్లూ కలర్ వస్తువు వచ్చిన దిశలోనే అత్యంత వేగంగా వచ్చిందని.పెద్ద కొండ మీదుగా వెళ్ళిన ఆ ఆబ్జెక్ట్ ఎటు వెళ్లి పోయిందో తాము చూడలేకపోయానని అన్నారు.
వీటి గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఈ వస్తువులు ఏమై ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా సముద్రంలో పడిపోయిన వస్తువు కచ్చితంగా యూఎఫ్ఓ అని.ఏలియన్లు ఇదే వస్తువులో భూమి మీదకు ప్రయాణించాయి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వస్తువులలో నిజంగా గ్రహాంతరవాసులు భూమ్మీదికి వచ్చాయా? అనే చర్చ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.ఇవి ఏంటో కనుగొనేంతవరకు ఏలియన్ లు ఉన్నాయ్ అని తాము చెప్పలేము అని కొంతమంది చెబుతున్నారు.