సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కడైనా బయట కనిపించినా అలాగే ఏదైనా అవార్డుల ఫంక్షన్లకు ఈవెంట్లకు వచ్చినప్పుడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.అప్పుడు వివిధ రకాలుగా ఫోటోలకు నిలబడి ఫోజులిస్తూ ఉంటారు.
మరి కొంతమంది మాత్రం ఫోటోలు తీస్తున్నప్పటికీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు.ఇంకొందరు సెలబ్రిటీలు అయితే అక్కడే ఉన్న అభిమానులకు ఓపికగా సెల్ఫీలు కూడా ఇస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక అవార్డుల ఫంక్షన్ కు హాజరైన విద్యాబాలన్ కూడా ఫోటోలు తీస్తుండడంతో నిలబడి నడుము పై చేతులు పెట్టుకొని ఫోటోలకు తెగ ఫోజులు ఇచ్చింది.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విద్యాబాలన్ ఎంతసేపు ఆ ఫోటోలపై దృష్టి పెట్టిందే తప్ప తన భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ పై దృష్టి పెట్టినట్టుగా కనిపించడం లేదు.
విద్యాబాలన్ తో కలిసి ఫోటోలు దిగేందుకు సిద్ధార్థ రెడీ అయినప్పటికీ ఆమె మాత్రం తన భర్తను పట్టించుకోలేదు.దీంతో సిద్ధార్థ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి ఈ పక్కకు వెళ్ళిపోతాడు.
అయినా కూడా విద్యాబాలన్ అవేమీ పట్టించుకోకుండా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలను చూసిన చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తుండగా వీడియో చూసిన అభిమానులు మాత్రం విద్యాబాలన్ పై ట్రోలింగ్స్ చేస్తూ మండి పడుతున్నారు.ఇంత ఫోటోల పిచ్చి ఉంటే మాత్రం భర్తను కూడా మైమరిచిపోతారా? అని కొందరు కామెంట్ చేయగా అసలు వీరి మధ్య దాంపత్యం జీవితం బాగానే ఉందా అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి విద్యాబాలన్ చేసిన పనికి ఆమె దారుణంగా ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటోంది.ఆమె ఫోటోలు దిగే క్రమంలో భర్తని పట్టించుకోకుండా ఆమె చేసిన పనికి పలువురు నెటిజెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకొందరు మాత్రం ఆమె ఫోటోలపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.