వేణుస్వామి మరో సంచలనం.. 'సలార్'పై అలాంటి కామెంట్స్ చేసి ఫ్యాన్స్ కు భారీ షాక్!

వేణు స్వామి ( Venu Swamy )అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అనే చెప్పాలి.ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మధ్య కాలంలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నాడు.

 Venu Swamy's Shocking Comments On Prabhas Salaar, Venu Swamy, Salaar, Salaa-TeluguStop.com

ఈయన చెప్పినవి చెప్పినట్టు జరగడంతో ఈయన బాగా ఫేమస్ అయ్యాడు.ముఖ్యంగా సెలెబ్రిటీల జాతకం ముందే చెప్పేస్తూ వారికీ టెన్షన్ పెట్టేస్తుంటారు.

దీంతో ఈయన బాగా ఫేమస్ అయ్యాడు.

రాజకీయ, సెలెబ్రిటీల జాతకాలను బయటపెట్టేస్తూ పాపులర్ అయ్యాడు.ఈయన సమంత, నాగ చైతన్య( Samantha Naga Chaitanya )విడిపోతారు అని ముందుగానే చెప్పి కంగారు పుట్టించాడు.కానీ ఈయన చెప్పినట్టుగానే ఈ జంట విడిపోయారు.

అలాగే హీరోయిన్స్ అయితే వేణు స్వామితో ప్రత్యేకమైన పూజలు చేయించుకుని కెరీర్ లో దూసుకుపోతున్నారు.ఇక ఈ ఏడాది ప్రభాస్ ( Prabhas )నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యిన సమయంలో ఈ సినిమా అసలు హిట్ అవ్వదని సంచలనాలు నమోదు చేసే ఛాన్స్ ఏ మాత్రం లేదని రెండు వారాల ముందుగానే చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు.

ముందు ఫ్యాన్స్ నమ్మక పోయిన ఆ తర్వాత అదే జరిగి దారుణంగా విఫలం అయ్యింది.దీంతో ఈయనను నమ్మక తప్పలేదు.

ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన మరో మూవీ ‘సలార్’( Salaar ) రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమా విషయంలో కూడా వేణు స్వామి సంచలన రివ్యూ ఇచ్చారు.దీంతో ఫ్యాన్స్ లో కంగారు మొదలయ్యింది.సలార్ విషయంలో కూడా నిరాశ చెందే అవకాశం ఉందని.ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వదు అని వేణు స్వామి చెప్పినట్టు తెలుస్తుంది.ఈ వార్తలో నిజానిజాలు తెలియవు కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను( Social media ) షేక్ చేస్తుంది.

చూడాలి మరి సలార్ విషయంలో ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube