సంక్రాంతి బరిలో వకీల్ సాబ్... ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.ఈ హిందీలో పింక్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Vakeel Saab Movie Move To Release In Sankranthi, Tollywood, Pawan Kalyan, Dil Ra-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.మెజారిటీ షూటింగ్ పూర్తయిపోయింది.

షూటింగ్ చివరి దశలో ఉండగా లాక్ డౌన్ పడటంతో ఒక్కసారిగా ఆగిపోయింది.ఇప్పటి వరకు షూటింగ్ చేసిన మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని దిల్ రాజు భావించాడు.ఈ కారణంగానే షూటింగ్ కి ఎలాంటి గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని అనుకున్నారు.

అయితే దీనికి కరోనా వైరస్ పెద్ద అడ్డంకిగా మారింది.దసరాకి కూడా సినిమా రిలీజ్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు.

కరోనా వైరస్ ఎప్పటికి కట్టడి అవుతుంది అనేది అర్ధం కాని విషయంగా ఉంది.

ఈ నేపధ్యంలో మళ్ళీ సినిమాలు షూటింగ్ లు మొదలుకావాలంటే రెండు నెలలకి పైగానే పట్టే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో సినిమాని కాస్తా లేట్ అయిన సంక్రాంతి బరిలో వకీల్ సాబ్ ని దింపాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్టపడి నటిస్తున్న సినిమా కావడం వకీల్ సాబ్ రిలీజ్ తర్వాతనే మిగిలిన సినిమాల మీద దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తే మంచి క్రేజ్ ఉంటుందని భావించి దిల్ రాజు ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే దిల్ రాజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేంత వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube