పుష్పలో అల్లు అర్జున్ తో తలపడేది రవితేజ విలనేనా

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన టైటిల్, హీరో లుక్స్ ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.

 Bobby Simha Fight With Allu Arjun In Pushpa Movie, Tollywood, Kollywood, Sukumar-TeluguStop.com

చిత్తూరు జిల్లాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ కథ ఉంటుంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

రంగస్థలం స్టైల్ లోనే పక్క మాస్ రోల్ లో సుకుమార్ అల్లు అర్జున్ ని పుష్ప సినిమా కోసం చూపించబోతున్నాడు.ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయిపొయింది.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా ఒక ట్రైబల్ యువతీ పాత్రలో కనిపించబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ముందు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

అయితే అతను సినిమా నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు.పాత్ర నచ్చిన అది తమిళ ప్రజల మనోభావాలని దెబ్బ తీసే విధంగా ఉంటుందనే అభిప్రాయంతో తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

విజయ్ తప్పుకోవడం ఆ పాత్ర కోసం సుకుమార్ కన్నడ హీరో ధనుంజయ్ ని రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపించింది.అయితే పుష్ప సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో మల్టీ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఆ పాత్ర కోసం సౌత్ లో ఈ మధ్య కాలంలో పవర్ ఫుల్ విలనిజం చూపిస్తున్న తెలుగు నటుడు బాబీ సింహాని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే తమిళంలో విలన్ గా బాబీ సింహా తన సత్తా చాటాడు.

అయితే తెలుగులో మాత్ర అతని కెపాసిటీకి దగ్గ పాత్ర ఇప్పటి వరకు పడలేదు.అయితే పుష్ప సినిమా మాత్రం అతని విలనిజంకి కరెక్ట్ గా సరిపోయే రోల్ అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube